అమెరికాలో పని ప్రారంభించిన లోకేష్

తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు లోకేష్. దావోస్ ఆర్థిక సదస్సుకు వెళ్లిన ఏపీ ఐటీ అండ్ పంచాయితీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ అటు నుంచి అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లోకేష్ తన పర్యటనతో బిజీ బిజీగా ఉన్నాడు. అక్కడి ఐటీ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి పెట్టుబడుల కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. వారిని ఆకర్షిస్తున్నారు. లాస్ ఏంజిల్స్ లో ఇన్వెస్ట్మెంట్ రోడ్ షో కు మంచి స్పందన వచ్చింది. ఏపీలో పెట్టుబడుల కోసం పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. తెలుగు వారైన పారిశ్రామిక వేత్తలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. వైద్యం, ఆరోగ్యం, ఎలక్ట్రానిక్ తయారీ, పునరుత్పాదక శక్తి ద్వారా కార్యక్రమాల నిర్వహణ, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వారు ఉత్సాహం చూపిస్తున్నారు. 
ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి అనువైన వాతావరణం ఉంది. అన్ని వసతి సౌకర్యాలను కల్పిస్తామని లోకేశ్ వారికి వివరిస్తున్నారు. స్టార్ట్ అప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వమే రూ.100 కోట్ల నిధులు కేటాయించిన సంగతిని గుర్తు చేశారు. లాస్ ఏంజెల్స్ లో నిర్వహించిన ఇన్వెస్ట్మెంట్ రోడ్ షో లో మంత్రి వివిధ సంస్థ ప్రతినిధులతో వరుసగా భేటీలు నిర్వహించారు. అడ్వాన్స్ బ్యాటరీ సిస్టమ్స్ కంపెనీ సిఈఓ రిచర్డ్ కెయిన్, వైస్ ప్రెసిడెంట్ మైక్ పాలోమీరాతోను లోకేశ్ మాట్లాడారు. 
అంతే కాదు… లితియం అయాన్ బ్యాటరీ తయారీ లో ఉన్న అడ్వాన్స్ బ్యాటరీ సిస్టమ్స్ ఎలక్ట్రానిక్ తయారీ రంగాన్ని, ఎలెక్ట్రిక్ వాహనాల తయారీని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు లోకేశ్ తెలిపారు. సన్ రైజ్ స్టేట్ లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వినియోగం పెంచడానికి రూపొందించిన కొత్త పాలసీలను వారికి చెప్పారు. త్వరలోనే ఏపీకి వచ్చి మార్కెట్ అంచనా వేసి నిర్ణయం తీసుకుంటామని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. భారత్ లో బ్యాటరీ తయారీ కంపెనీ ఏర్పాటుకు వారు మొగ్గు చూపారు. ఆ తర్వాత ఎలక్టో హెల్త్ కేర్ సిఈఓ లక్ష్మణ్ రెడ్డితోను నారా లోకేశ్ సమావేశమయ్యారు. వారి మధ్య జరిగిన చర్చలు ఫలవంతమయ్యాయి. ఏపీలో ఎలక్టో హెల్త్ కేర్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు వారు సిద్దమయ్యారు. సాఫ్ట్ హెచ్క్యూ సీఈవో క్రాంతి పొన్నం, సిస్ ఇంటెలి సీఈవో రవి హనుమారతోను లోకేశ్‌తో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వారు ముందుకు వచ్చారు. అమెరికాలో ఉంటున్న ఏపీఎన్ఆర్టీ ప్రతినిధులతో పాటు… ఎన్నారైలు, వారి కంపెనీల ప్రతినిధులతోను సమావేశం కానున్నారు. వచ్చే నెల 2న అట్లాంటాలో పర్యటించనున్న లోకేష్ తో మాట్లాడేందుకు కొన్ని కంపెనీలు ముందుకు వచ్చాయి. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.