
తన ప్రసంగంలో అప్పుడప్పుడు తప్పులు మాట్లాడుతూ వివాదాల్లో చిక్కుకుంటుంటాడు ఏపీ మంత్రి నారా లోకేష్. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి కుమారుడిగా రాజకీయ ఆరంగేట్రం చేశాడు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తక్కువ కాలంలోనే ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రి పదవిని చేపట్టాడు. పనుల పరంగా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే లోకేష్.. ప్రసంగాలు చేసేటప్పుడు మాత్రం ఒక్కోసారి తడబడుతుంటాడు. దీంతో తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా ఆయన మరోసారి హైలైట్ అయ్యాడు. అయితే, ఈ సారి తప్పులు మాట్లాడి మాత్రం కాదు.. ఓ మంచి పని చేసి అభినందనలు పొందుతున్నాడు. తాజాగా లోకేష్ చేసిన ఓ ట్వీట్ కారణంగా అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఈ సంవత్సరం కూడా ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌లో ఆంధ్రప్రదేశ్ర్ రాష్ట్రం మళ్లీ సత్తా చాటింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టాప్‌లో నిలవగా, తెలంగాణా రెండో స్థానంలో వచ్చింది. 2016 జూలై నుంచి ఈ సంవత్సరం జూలై వరకు వివిధ ప్రమాణాల ఆధారంగా రూపొందించిన ఈ జాబితాను ప్రపంచ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వానికి చెందిన పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డిఐపిపి) మంగళవారం విడుదల చేశాయి. ఈ సారి ఈ జాబితాలో 98.42 శాతం స్కోరుతో ఆంధ్రప్రదేశ్ సులభతర వ్యాపారానికి దేశంలో అత్యంత అనువైన రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాది ఎపితో కలిసి మొదటి స్థానంలో ఉన్న తెలంగాణ, ఈసారి 98.33 శాతం స్కోరుతో రెండో స్థానం దక్కించుకుంది.
అయితే ఈ ర్యాంకులపై కేటీఆర్ ట్విట్టర్లో స్పందించారు. కేంద్రం ప్రకటించిన సులభతర వాణిజ్య ర్యాంకుల్లో తొలి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ ఐటీ శాఖమంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. 0.09 శాతం తేడాతో ఈవోడీబీలో తెలంగాణకు తొలి ర్యాంకు తప్పిందన్నారు. అధికారులు కనబరిచిన మంచి పనితీరు వల్ల ఈ ఏడాదీ మంచి ర్యాంకు సాధించామని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. దీని పై లోకేష్, కేటీఆర్‌కు రిప్లై ఇచ్చారు ‘ఈ విషయంలో మీకు కూడా అభినందనలు .. మేము నెంబర్ వన్, మీరు నెంబర్ టూ కాదు.. రెండు రాష్ట్రాలూ అగ్రస్థానంలో నిలిచాయి. తెలుగు ప్రజల అభివృద్ధి కోసమే’ అంటూ ఆయన పేర్కొన్నారు. లోకేష్ చేసిన ట్వీట్‌తో అందరూ ఆయనను మెచ్చుకుంటున్నారు.
Be the first to comment