ఏంటి… లోకేష్ ఈ స్థాయిలో పంచులేస్తాడా?!

లోకేష్ నారా… చంద్ర‌బాబు వార‌సుడిగానే అంద‌రూ చూస్తుంటారు. ఎమ్మెల్సీ ప‌ద‌వితో మంత్రి అయిన‌ లోకేష్ గానే ఎక్కువ మందికి తెలుసు. కానీ అమెరికాలో పీజీ చ‌దువుతున్న‌ప్ప‌టి నుంచే త‌న‌కు సంబంధం లేక‌పోయినా పార్టీ ప‌రంగా ప్ర‌తి విష‌యాన్ని ఒంట‌బ‌ట్టించుకుని, అవ‌గాహ‌న చేసుకున్న లోకేష్ గురించి తెలుగుదేశంలోనే చాలా కొద్దిమందికి మాత్ర‌మే తెలుసు. పార్టీ సభ్య‌త్వంతో పాటు కార్య‌క‌ర్త‌ల‌కు యాక్సిడెంట్ బీమా, లైఫ్ బీమా ఇచ్చే ఐడియా లోకేష్ ఎగ్జిక్యూష‌నే. ఈరోజు గ‌వ‌ర్న‌మెంటు చేస్తున్న న‌గ‌దు బ‌దిలీ అనే కాన్సెప్ట్ గురించి తెలుగు రాజ‌కీయాల్లో మొద‌ట మాట్లాడింది కూడా లోకేష్ నారాయే. కానీ ప్ర‌మోష‌న్ ఉన్నా ప్ర‌జెంటేష‌న్ లేక‌పోవ‌డం వల్ల లోకేష్ ఐడియాల‌జీ రీచ్ చాలా త‌క్కువ‌.
మాట్లాడేవాడు మొన‌గాడు అన్న‌ట్టు… క‌బుర్లు చెప్పేవాళ్లను ఆహా ఓహో అనే జ‌నం… ఎంత విష‌య‌మున్నా ప్రెజెంటేష‌న్ లేక‌పోతే అర్థం చేసుకోవ‌డానికి క‌నీసం ట్రై కూడా చేయ‌రు. అయితే, ఈ మ‌ధ్య లోకేష్లో ఆ విష‌యంలోనూ కొన్ని మార్పులు వ‌స్తున్నాయి. తాజాగా ఈరోజు లోకేష్ వేసిన పంచులు ఒక్క‌సారిగా లోకేష్ వైపు చూసేలా ఉన్నాయి.
తూర్పుగోదావ‌రి జిల్లాలో జ‌రిగిన జ‌న్మ‌భూమి కార్య‌క్రమంలో పాల్గొన్న ఏపీ మంత్రి నారా లోకేష్ బీజేపీని పంచుల‌తో ఆడుకున్నారు. ప్ర‌జ‌లు కర్ణాటకలో బీజేపీ కి కేవలం ట్రైలర్ మాత్రమే చూపించారని, ఏపీ ప్రజలు బీజేపీ కి సినిమా చూపించడానికి సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ప్ర‌జ‌లు మోడీకి న‌మ్మ‌కాన్ని ఇస్తే… మోడీ ప్ర‌జ‌ల‌కు మోసాన్ని మిగిల్చార‌న్నారు. ప్ర‌ధాని మోడీ, మోనార్క్ మోడీ అయ్యార‌న్నారు.
ఈ లోక్‌స‌భ ఎన్నిక‌ల త‌ర్వాత దేశ ప్రధాని ఎవరు? అనేది చంద్రబాబు నిర్ణయిస్తాడని లోకేష్ జోస్యం చెప్పారు. జ‌గన్ త‌న స్వార్థం కోసం రాష్ట్రాన్ని మోడీకి తాక‌ట్టు పెడుతున్నార‌ని అన్నారు. అందుకే ఒకే ప్ర‌శ్న అడుగుతున్నా… * ప్రత్యేక హోదాపై జగన్‌ ఏనాడైనా మోదీని నిలదీశారా?*
ప్రజాసంకల్ప యాత్ర ముగింపు సభలోనూ మోడీని జగన్ ఒక్క విమ‌ర్శ చేయ‌లేద‌ని, అది చాలదా మోడీ చేతుల్లో జ‌గ‌న్ ఉన్నార‌ని చెప్ప‌డానికి అంటూ లోకేష్ విమ‌ర్శించారు. ఏపీ లో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మ‌రోసారి వ‌స్తుంద‌ని, మ‌రో చరిత్రాత్మ‌క తీర్పు ఇవ్వ‌డానికి ఏపీ ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నార‌ని లోకేష్ వ్యాఖ్యానించ‌డం కొస‌మెరుపు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.