పవన్ కు లోకేష్ వార్నింగ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్షేత్ర స్థాయిలో వాస్తవాలు తెలుసుకోవాలంటున్నారు మంత్రి లోకేష్. అప్పుడే వివిధ సమస్యలపై మాట్లాడారని హితవు పలికారు. పవన్ కళ్యాణ్ గతంలో ఉద్దానం సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. చంద్రబాబు వెంటనే స్పందించారని లోకేష్ గుర్తు చేశారు. ఉద్దానం ప్రజలకు రక్షిత తాగునీటిని అందించేందుకు ఎన్టీఆర్‌ సుజల ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాం. కుప్పానికి మంజూరైన ఎన్టీఆర్‌ సుజల ప్లాంట్లను కూడా సీఎం ఉద్దానంకు తరలించాలని ఆదేశించారని చెప్పారు. అంతే కాదు… అసలు పవన్‌ను కొందరు వ్యక్తులు తప్పుదారి పట్టిస్తున్నారని ప్రస్తావించారు. 
చంద్రబాబు, లోకేష్ ల పై ఆరోపణలు చేసిన పవన్ కల్యాణ్.. తనకు ఎవరో చెప్పారని మాట మార్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ అదే ఆలోచనలో ఉన్నారు లోకేష్. ఎవరైనా తప్పుదోవ పట్టిస్తే ఆలోచించుకో పవన్. జాగ్రత్తగా వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడవద్దని చెప్పారు. ఫలితంగా లోకేష్, పవన్ ల మధ్య మాటల యుద్దం ప్రారంభమైంది. అంతే కాదు.. నన్ను అడ్డుకునే కుట్ర చేస్తే అంతు తేలుస్తానంటూ సినిమా డైలాగ్ లు చెబుతున్నారు పవన్. అది సినిమాల్లో అది సరిపోతోంది. కానీ బయటకు వచ్చాక సహనం కోల్పోతే ఇబ్బంది పడిదే పవన్ అన్న సంగతి మర్చిపోతున్నట్లున్నారు.
2014 ఎన్నికలలో పోటీ చేయనందుకు బాధపడుతున్నానని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అంటున్నారు. అప్పట్లో బలమైన ప్రభుత్వం ఏర్పడడానికే ఆపని చేశానన్నారు. ఓట్లు చీలకూడదనే ఆలోచనలో తాను పోటీలో లేనని చెప్పారు. ఆనాడు నేను చేసిన పనికి ఈ రోజు చింతిస్తున్నాను. ఎందుకు నేను కొద్ది స్థానాల్లోనైనా పోటీచేయలేదే అని ఆలోచిస్తున్నాను అని పవన్ ఇప్పుడు అంటున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం పవన్. గతంలోనే ఆ పని చేస్తే బావుండేది. క్యాడర్ ను అదుపు చేయలేక యాత్రను వాయిదా వేసుకున్న పవన్ కు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రచారం తగ్గింది. మీడియా లైట్ తీసుకుంటోంది. ఫలితంగా పవన్ యాత్ర పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వం సెక్యూరిటీ తగ్గించింది. తాను ఉంటున్న ఇంటికి కరెంట్ కట్ చేసి ఇబ్బంది కలిగిస్తుందని పవన్ వాపోతున్నాడు. వేసవిలో ఫీడర్ ట్రిప్ అయి ఏరియా అంతా కరెంట్ పోయింది. కావాలని ఎవరైనా కరెంట్ కట్ చేస్తారా అంటున్నారు అక్కడి విద్యుత్ శాఖ అధికారులు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.