అత‌నిది దోపిడీ… ఇత‌నిది స్క్రిప్ట్ బ‌ట్టీ

ఏపీలో రాజకీయాలు రోజురోజుకు మ‌రింత హీటెక్కుతున్నాయి. సార్వ‌త్రిక‌ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ వివిధ పార్టీలు తమ ఎత్తుగడలతో ప్రజల్లోకి వెళ్తున్నాయి. వైఎఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్లి విస్తృతంగా యాత్రలు నిర్వ‌హిస్తున్నారు. అయితే మరోవైపు అధికారంలోవున్న టిడిపి కూడా ధర్మ పోరాట దీక్షల‌ పేరుతో ప్రజలను ద‌గ్గ‌ర‌చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. తమ పార్టీ గత నాలుగేళ్లలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పధకాలే తమకు అండ‌గా నిలుస్తాయ‌ని, అవే తమను రానున్న ఎన్నికల్లో మళ్లి గద్దెనెక్కేలా చేస్తాయని టీడీపీ నేత‌లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తాను గత ఎన్నికల్లో టీడీపీకి ఎందుకు మద్దతు ఇచ్చిందీ వెల్ల‌డించారు. చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడైన నాయకుడి పర్యవేక్షణలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంద‌నే ఉద్దేశంతో అత‌నికి మ‌ద్ద‌తు ప‌లికాన‌ని తెలిపారు.

అయితే తాను అనుకున్న విధంగా చంద్రబాబు హామీల‌ను నెర‌వేర్చ‌కుండా రాష్ట్రాన్ని, ప్రజల సమస్యలను పూర్తిగా గాలికి వదిలేశార‌ని ప‌వ‌న్ ఎద్దేవా చేశారు. అయితే ఈ విష‌య‌మై సోషల్ మీడియాలో స్పందించిన ఐటి మంత్రి నారా లోకేష్ .. ఒకప్రక్క సీఎంతోసహా టీడీపీ నేతలు, కార్యకర్తలు రాష్త్ర అభివృద్ధికి ఎంతో తోడ్ప‌డుతున్నార‌న్నారు. అయితే ప్రతిపక్షాలు తమపై లేనిపోని విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టేలా వ్యవహరిస్తున్నాయి లోకేష్ విమ‌ర్శించారు. జగన్ వచ్చే ఎన్నికల్లో రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలా అని అధికారం కోసం వేచిచూస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్రం కనుసన్నల్లో మెలుగుతూ, తమపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. పవన్ మీరు బీజేపీ ఇచ్చిన స్క్రిప్ట్ ని బాగానే చదువుతున్నారు. వారితో మీకున్న లాలూచీని బయటపెట్టండి అంటూ లోకేష్ స‌వాల్ విసిరారు. ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా కూడా రానున్న ఎన్నికల్లో టీడీపీ అత్యధిక మెజారిటితో ఏపీలో అద్భుత విజయాన్ని సాధిస్తుందని లోకేష్ ఆశాభావం వ్య‌కం చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.