లోకేష్ దూకుడుతో బీజేపీకి ఝ‌ల‌క్‌

టీడీపీ యువ‌నేత‌, మంత్రి నారా లోకేష్ అనూహ్య రీతిలో త‌న రాజకీయ దూకుడును పెంచుతున్నారు. ఓవైపు ప్ర‌భుత్వ ప‌ర‌మైన కార్యక‌లాపాల్లో క్రియాశీలంగా పాల్గొంటూనే…మ‌రోవైపు పార్టీప‌రంగా న‌జ‌ర్ పెడుతున్నారు. ఇందులో భాగంగా ఇటీవ‌ల త‌న స్పీడ్ పెంచుతున్నారు. త‌మ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి అయిన వైసీపీపై పెద్ద ఎత్తున ఎదురుదాడి చేస్తూనే మ‌రోవైపు ఇటీవ‌లే బంధం తెంచుకున్న బీజేపీని సైతం ఇర‌కాటంలో ప‌డేలా లోకేష్ టార్గెట్ చేస్తున్నారు. తాజాగా లోకేష్ స్పందించిన తీరు ఇటు బీజేపీ శ్రేణుల‌నే కాకుండా అటు టీడీపీ శ్రేణుల‌ను సైతం ఆశ్చ‌ర్యంలో ప‌డేస్తున్నాయి. అమ‌రావ‌తిలో ఉంటూనే..ఢిల్లీ రాజ‌కీయాల‌ను క్ష‌ణాల వ్య‌వ‌ధిలోనే ఇంత నిశితంగా గ‌మ‌నిస్తున్నారా అంటూ ప‌లువురు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. 
వివ‌రాల్లోకి వెళితే…ఏపీలో బీజేపీని బ‌లోపేతం చేయాల‌నే ల‌క్ష్యంతో ఉన్న బీజేపీ సీనియ‌ర్ నేత కన్నా లక్ష్మీనారాయణకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష బాధ్య‌త‌లు క‌ట్ట‌బెట్టిన సంగ‌తి తెలిసిందే. ఏపీ పార్టీ ర‌థ‌సార‌థిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ప్రధాని మోడీని ఈరోజు ఢిల్లీలో క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ కలిశారు. ఈ సంద‌ర్భంగా స‌హ‌జంగా ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై చర్చలు జరిపారు. అనంత‌రం క‌న్నా ఢిల్లీలోనే మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ఇంకా కేంద్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన 12 అంశాల జాబితాను ప్రధానికి ఇచ్చినట్లుగా తెలిపారు. అలాగే త్వరలోనే మరోసారి పార్టీ నుంచి  ఓ ప్రతినిధి బృందం వచ్చి ప్రధానిని కలిసి ఈ అంశాలను త్వరిత గతిన అమలు చేయాలని కోరతామని కూడా కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు.
అయితే క‌న్నా మీడియాతో మాట్లాడిన క్ష‌ణాల వ్య‌వ‌ధిలోనే మంత్రి లోకేష్ అనూహ్య రీతిలో స్పందించారు. ట్విట్ట‌ర్‌లో ప్ర‌త్యేకంగా ఓ ట్వీట్ చేసిన మంత్రి లోకేష్ ఈ సంద‌ర్భంగా బీజేపీ తీరును ఎండ‌గ‌ట్టారు. ప్రధాని మోడీకి ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ  ఇచ్చిన లిస్ట్ లో ప్రత్యేక హోదా అంశం ఎందుకు లేదని ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రధానికి ట్వీట్ చేశారు. `ఓవైపు ఏపీకి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చమని చెబుతున్నారు. మరోవైపు… ”కుతుబ్ మినార్ అంత  లిస్ట్” కేంద్రానికి ఇచ్చారు ఇదేం పద్దతి? ఈ లేఖ‌తోనే మీరు చెప్పేవన్నీ అబద్ధాలు అని తేలిపోయింది. ఈ విషయాలన్ని ప్రజలు గమనిస్తున్నారు. మాపై తప్పుడు ప్రచారాన్ని మానుకుని… ఏపీకి ఇచ్చిన హామీలన్నీ వెంటనే నెరవేర్చాలి` అని లోకేష్ ట్వీట్ చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.