బిగ్ బాస్ … లీకుల‌తో హ‌డ‌ల్ !

బిగ్ బాస్ సీజ‌న్ 2 ఫైన‌ల్ కు వ‌చ్చేసింది. మ‌రో వారంలో ఈ షో ముగియ‌నుంది. ఫైన‌ల్ కు ముందు.. హౌస్ నుంచి చివ‌రి ఎలిమినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని ఆదివారం టెలికాస్ట్ చేశారు. టీవీలో షోను టెలికాస్ట్ చేయ‌టానికి కొన్ని గంట‌ల ముందే.. సోష‌ల్ మీడియాలో తాజా ఎలిమినేష‌న్ ఎవ‌రిద‌న్న విష‌యం లీకైంది.
బిగ్ బాస్ 2కు లీకుల పోటు భారీగా ఉండ‌టం తెలిసిందే. టీవీలో టెలికాస్ట్ కావ‌టానికి ఒక రోజు ముందు నుంచే.. త‌ర్వాతి ఎపిసోడ్‌లో ఏం కానుంద‌న్న విష‌యం సోష‌ల్ మీడియాలో ఒక రేంజ్లో హోరెత్త‌టం కామ‌నైంది. దీనికి త‌గ్గ‌ట్లే చిట్ట‌చివ‌రి వారం ఎలిమినేష‌న్ లో రోల్ రిడా ఎలిమినేట్ అయ్యారు.
ఎలిమినేష‌న్ ముప్పును ఎదుర్కొన్న రోల్ రిడా.. దీప్తి న‌ల్ల‌మోతు ఇద్ద‌రి మ‌ధ్య పోటీ నువ్వా నేనా? అన్న‌ట్లుగా సాగింది. అయితే.. ఓట్ల విష‌యానికి వ‌స్తే.. రోల్ రిడా వెన‌క‌ప‌డిపోయాడు. దీంతో.. ఎలిమినేట్ కాక త‌ప్ప‌లేదు. వంద రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అత‌గాడు.. వేద‌న‌తో ఈ వారం త‌న జ‌ర్నీకి పుల్స్టాప్ పెట్టేశాడు.
తాజా ఎలిమినేష‌న్ తో హౌస్ లో ఐదుగురు మిగిలారు. కౌశ‌ల్‌.. సామ్రాట్‌.. తనీష్.. గీతామాధురి.. దీప్తి న‌ల్ల‌మోతులు మిగిలారు. వ‌చ్చే వారంతో బిగ్ బాస్ షో ముగియ‌నుంది. అంతిమ విజేత ఎవ‌ర‌న్న‌ది తేలాలంటే మ‌రో వారం వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు. బిగ్ బాస్ షో సీజ‌న్ 2 ప్ర‌కారం అయితే.. శ‌నివారం నాటికే విజేత ఎవ‌రో తెలిసే వీలుంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎందుకంటే.. బిగ్ బాస్ కు సంబంధించి ఆస‌క్తిక‌ర అంశాల‌న్నీ ఒక‌ట్రెండు రోజుల ముందే లీక‌వుతున్న నేప‌థ్యంలో.. అంతిమ విజేత ఎవ‌ర‌న్న విష‌యం కూడా లీక్ అవుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.
ఇదిలా ఉంటే.. గ్రాండ్ ఫైన‌ల్ లో టాప్ త్రీలో ఎవ‌రు ఉంటారు? అన్న ప్ర‌శ్న‌కు రోల్ రిడా స‌మాధాన‌మిచ్చారు. ఈ ప్ర‌శ్న‌కు ఏ మాత్రం త‌డుముకోని రోల్ రిడా.. కౌశ‌ల్ పేరును ముందు చెప్పారు. ఆ త‌ర్వాత త‌నీశ్‌.. గీతామాధురిలు ఉంటార‌ని చెప్పారు.
కౌశ‌ల్ గెలుపుపై ధీమా వ్య‌క్తం చేసిన రోల్ రిడా వ్యాఖ్య‌ల‌పై ఎప్ప‌టిలానే కౌశ‌ల్ ఆర్మీ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యింది. కౌశ‌ల్ విజ‌యాన్ని ముందుగానే రోల్ ప‌సిగ‌ట్టాడ‌ని పేర్కొంది. తాను హౌస్ నుంచి తిరిగి వ‌చ్చే వేళ‌లో రోల్ చెప్పిన చిన్న క‌విత ప‌లువురి మ‌న‌సుల్ని దోచేసింది. మా గ‌ల్లీలు ఇరుకుగా ఉంటాయేమో కానీ మా వాళ్ల హృద‌యాలు మాత్రం దుబాయ్ లో ఉండే బుర్జ్ ఖ‌లీఫా కంటే అద్భుతంగా ఉంటాయ‌ని ఎమోష‌న్ అయ్యాడు. పెద్ద‌గా అంచ‌నాలు లేకుండా బ‌రిలోకి దిగిన రోల్‌.. ఊహించ‌ని విధంగా ఆడుతూ హౌస్ లో వంద రోజుల వ‌ర‌కూ ఉండ‌టం అత‌గాడి విజ‌యంగా చెప్పక త‌ప్ప‌దు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.