యూట‌ర్న్‌ల‌తో.. నేత‌ల‌కు చిక్కులు!

నోట్ల‌ర‌ద్దు గురించి ఆలోచించ‌వ‌ద్దు.. కొద్దిరోజులు ఆగండి.. మీ ఖాతాలో ల‌క్ష‌లు ప‌డ‌క‌పోతే ఒట్టు.. సాక్షాత్తూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ. తెలంగాణ వ‌స్తే.. టీఆర్ ఎస్ గెలిస్తే.. ద‌ళితుడుని సీఎం చేస్తానంటూ.. ఎప్పుడో మ‌న తెలంగాణ సీఎం కేసీఆర్ సారు సెల‌విచ్చారు. ఇక‌పోతే.. ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు.. 2018 జూన్‌క‌ల్లా పోల‌వ‌రం పూర్తి అంటూ చెప్పేశారు. విప‌క్షంలో ఉన్న జ‌గ‌న్‌.. అయితే ఊరూవాడా పాద‌యాత్ర‌ల్లో హామీలు గుప్పిస్తూనే ఉన్నారు. మొన్న‌టి వ‌ర‌కూ బీజేపీ, టీడీపీల‌ను పొగిడిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. ఇప్పుడు ఆ ఇద్ద‌ర్నీ దుమ్మెత్తిపోస్తున్నాడు.
జ‌గ‌న్‌తో క‌ల‌యిక ఉంటుంద‌ని భావించినా.. పాపం జ‌గ‌న్ కారుకూత‌లు.. నాలుగు పెళ్లాల కామెంట్స్ దూరం చేశాయి. సాఫీగా సాగుతుంద‌ని భావించిన ప్ర‌యాణంలా… నేత‌ల హామీలు.. జ‌నం పెంచుకున్న న‌మ్మ‌కాల‌ను మించి యూట‌ర్న్‌లు తీసుకుంటున్నారు. మొన్నా మ‌ధ్య‌.. ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడే కావాల‌ని.. యూట‌ర్న్‌తీస‌కున్నాడంటూ కేంద్రం సెల‌విచ్చింది. జ‌గ‌న్ వ‌ల‌లో చిక్కి చంద్ర‌బాబు ఇలా చేస్తున్నారంటూ దుయ్య‌బ‌ట్టారు. ఛీ.. అదేం కాదు.. కేంద్ర‌మే యూట‌ర్న్‌ తీసుకుందంటూ.. చంద్ర‌బాబు, ఎంపీ సుజ‌నాచౌద‌రి  ఆరోపిస్తున్నారు. ఇప్పుడు.. జ‌గ‌న్ కూడా 2016 మాట్లాడిన కాపు రిజ‌ర్వేష‌న్స్‌పై.. తూచ్ అంటూ త‌న‌కు ట‌ర్నింగ్‌లు.. యూటర్న్‌లు కొత్తేంకాదంటూ నిరూపించుకున్నారు. ఇలా.. అధికార‌, విప‌క్ష పార్టీల‌న్నీ ట‌ర్నింగ్‌ల మీద ట‌ర్నింగ్‌లు తీసుకుంటూ.. స‌గ‌టు ఓట‌రుకు మీరు కూడా ట‌ర్నింగ్ తీసుకోమనే సంకేతాలు పంపుతున్న‌ట్లున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.