ఇంత‌కీ… ల‌గ‌డ‌పాటి ఎటువైపు!

బెజ‌వాడ అన‌గానే ప్ర‌కాశం బ్యారేజ్‌.. క‌న‌క‌దుర్గ‌మ్మ గుర్తుకు రావ‌టం స‌హ‌జం. అదే రాజ‌కీయాల్లో మాత్రం.. ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ పేరు కూడా అంతే స్పుర‌ణ‌కు వ‌స్తుంది. ప‌దేళ్ల‌పాటు విజ‌య‌వాడ పార్ల‌మెంటు స‌భ్యుడిగా వున్న నాయ‌కుడు. పైగా స‌ర్వేల పాపారాయుడుగా త‌న‌కంటూ ఇమేజ్  తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే.. ల‌గ‌డ‌పాటికి డిమాండ్ తెచ్చిపెట్టింది. అన్ని పార్టీలూ.. ఆయ‌న సేవ‌ల‌ను కావాల‌ని కోరుకోవ‌టానికి కార‌ణ‌మయ్యాయి. వాస్త‌వానికి 2014లో రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత‌.. రాజ‌గోపాల్ రాజ‌కీయ వైరాగ్యంతో పాలిటిక్స్ కు తాత్కాలిక విరామం ఇచ్చారు. ఆ త‌రువాత టీడీపీలో  చేర‌తాడ‌నే ప్ర‌చారం జ‌రిగింది. ఆ స‌మ‌యంలో ప‌లుమార్లు చంద్ర‌బాబునాయుడును క‌ల‌వ‌టం కూడా దీనికి బ‌లాన్నిచ్చింది. పైగా ల్యాంకోహిల్స్ నిర్మాణంతో భారీగా న‌ష్ట‌పోయిన రాజగోపాల్ చుట్టూ ఎన్నో వివాదాలు మొద‌ల‌య్యాయి.  నాటి కాంగ్రెస్ దిగ్గ‌జం ప‌ర్వ‌త‌నేని ఉపేంద్ర అల్లుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చినా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను నిలుపుకున్నారు.
అయితే.. అనంత‌రం కుటుంబ త‌గాదాలు.. ఆర్ధిక ఇబ్బందుల‌తో రాజ‌గోపాల్ మౌనంగా ఉంటున్నారు. ఇవ‌న్నీ ప‌క్క‌న‌బెడితే.. ఇప్పుడు ఆయ‌న ఏం చేస్తార‌నే అంశంపై ఉత్కంఠ‌త నెల‌కొంది. ఇటీవ‌ల ఏబీఎన్‌-ఆంధ్ర‌జ్యోతితో క‌ల‌సి చేసిన స‌ర్వేలో టీడీపీ గెలుపు ఖాయ‌మంటూ తేల్చారు. వైసీపీ, జ‌న‌సేల‌కు ఝ‌ల‌క్ ఇచ్చారు. దీని వెనుక ఆర్జీ ఎంత వ‌ర‌కూ ఉన్నార‌నే విష‌య‌మై కూడా అనుమానాలు లేక‌పోలేదు. ల‌గ‌డ‌పాటి స‌ర్వేలంటే.. ఇప్ప‌టికీ జాతీయ రాజ‌కీయాల్లోనూ న‌మ్మ‌కం ఉంది. మొన్న క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న చెప్పిన స‌ర్వే నిజ‌మైంది. ఇంత‌టి శాస్త్రీయ‌మైన స‌ర్వేతో వంద‌శాతం గ్యారంటీ అన్న‌ట్లుగా చేసే స‌ర్వే 2019లో టీడీపీను గ‌ట్టెక్కిస్తుంద‌నే న‌మ్మ‌కం టీడీపీలో మొద‌లైంది. ఇదంతా బాగానే ఉన్నా.. ల‌గ‌డ‌పాటి ఏ పార్టీలో చేర‌తారు. ఎవ‌రితో జ‌త‌క‌డ‌తారు. తిరిగి కాంగ్రెస్‌లోకి వెళ్లి అదృష్టం ప‌రీక్షించుకుంటారా! జ‌నసేనాని ప‌క్క‌న నిలుస్తారా! సైకిల్ ఎక్కి.. ఎమ్మెల్యేగా గెలిసి.. చంద్ర‌బాబు కేబినెట్‌లో కీల‌క‌మంత్రిగా చ‌క్రం తిప్పుతారా! ఎన్నో ఏళ్లుగా దేవినేని ఉమామహేశ్వ‌ర‌రావు పై ఉన్న ఒకే ఒక్క‌.. ప‌గ‌ను తీర్చుకుంటారా! పార్టీల బుర్ర‌ను.. ఇటు రాజ‌కీయ మేధావుల మెద‌డుకు అంద‌ని ఆలోచ‌ను.. రాజ‌గోపాల్ తీసుకునే నిర్ణ‌య‌మే స‌మాధానం. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.