టీఆర్ఎస్‌ తరపున ప్రచారం చేసిన లగడపాటి భార్య

కొద్దిరోజులుగా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నారు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. ఆంధ్రా ఆక్టోపస్ అని పిలుచుకునే లగడపాటి.. సర్వేల పేరుతో అందరికీ సుపరిచితులు అయ్యారు. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ముందస్తు ఎన్నికల వల్ల ఆయన మరోసారి హైలైట్ అవుతున్నారు. ఇటీవల తిరుమలలో శ్రీవారి సాక్షిగా కొన్ని కీలక విషయాలను వెల్లడించారాయన. తర్వాత మీడియా ముందుకు వచ్చి తెలంగాణ ప్రజలు ప్రజాకూటమివైపే ఉన్నారని చెప్పారు. దీంతో కేటీఆర్‌కు ఆయనకు మధ్య సోషల్ మీడియా వేదికగా యుద్ధం నడిచింది. దీని తర్వాత మరోసారి లగడపాటి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సంచలన విషయాలను బయటపెట్టారు. దీంతో టీఆర్ఎస్‌కు, లగడపాటికి మధ్య వార్ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో లగడపాటికి సంబంధించిన ఓ వార్త హాట్‌ టాపిక్‌గా మారింది. అదే లగడపాటి మొదటి భార్య పద్మ ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆ పార్టీ తరపున ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న దానం నాగేందర్‌కు మద్దతుగా ఆమె కొద్దిరోజులుగా ఇంటింటికీ తిరుగుతున్నారు. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ అయింది.

వాస్తవానికి దానం నాగేందర్ సతీమణి అనిత.. లగడపాటి పద్మ మిత్రులు. స్నేహితురాలి భర్త కోసం పద్మ ప్రచారంలో పాల్గొన్నారు. అంతేకానీ దీని వెనుక మరో రాజకీయ దురుద్దేశం లేదని తెలుస్తోంది. ఆమె ఎప్పటి నుంచో ప్రచారం నిర్వహిస్తున్నా.. లగడపాటి-కేటీఆర్ వార్ వల్లే వెలుగులోకి వచ్చారు. టీఆర్ఎస్ మద్దతుదారులు దీనిని వైరల్ చేస్తున్నారు. మరోవైపు, 2004లో ఎన్నిక‌ల అపిడ‌విట్‌లో త‌న‌కు ఇద్దరు కుమారుల‌న్నట్టుగా తెల‌పిన ల‌గ‌డ‌పాటి త‌రువాత 2009లో మాత్రం త‌న‌కు ముగ్గురు కుమారుల‌ని పేర్కొన్నారు. అంతేకాదు, మూడో కుమారుడి పేరు ఎల్ హ‌ర్మన్ అని పేర్కొన్నారు. దీంతో ల‌గ‌డపాటి రెండో పెళ్లి ఉదంతం తెర మీద‌కు వ‌చ్చింది. అప్పుడు ల‌గ‌డ‌పాటికి రెండో పెళ్లి జ‌రిగింద‌ని వారికి కుమారుడు కూడా జ‌న్మించాడ‌ని మైల‌వ‌రానికి చెందిన అడ్వకేట్ సుంక‌ర కృష్ణమూర్తి గతంలో రాష్ట్ర ఎన్నికల అధికారి కూడా ఫిర్యాదు చేశారు. ల‌గ‌డ‌పాటి.. జానకి అనే యువ‌తిని రెండో వివాహం చేసుకున్నార‌న్న లాయ‌ర్ వారి కుమారుడే హ‌ర్మోన్ అని పేర్కొన్నారు. రాజ‌గోపాల్, జాన‌కి దండ‌లు మార్చుకున్న ఫోటోను కూడా ఆయ‌న స‌మ‌ర్పించారు. అయితే ఈ సాక్షాలేవి చెల్లవ‌న్న కోర్టు స‌రైన సాక్షాలు లేని కార‌ణం కేసు కొట్టివేసింది. కానీ, తర్వాత ఆయన రెండో వివాహం గురించిన వివరాలు బయటకు వచ్చాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.