లగడపాటి తాజా సర్వే ఎలా ఉందంటే…

ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి జోస్యం మాములుగా ఉండదు. అలాంటి వ్యక్తి చెబితే నూటికి నూరుపాళ్లు నిజం ఉంటుందనే ప్రచారం ఉంది. కొన్ని సార్లు లగడపాటి ఇచ్చే రిపోర్టులు కాస్త అటు ఇటుగా అయ్యాయి. నంద్యాల ఫలితాల్లో అంత మెజార్టీ టీడీపీకి వస్తుందని అంచనా వేయలేకపోయారంటారు. అయినా సరే బీజేపీతో విడిపోయిన తర్వాత టీడీపీ పరిస్థితి ఏంటనే విషయం పై కోస్తాంధ్రలో లగడపాటి రాజగోపాల్ సర్వే చేయించారు. ఇప్పుడు సిఎం చంద్రబాబుకు ఇచ్చారంటున్నారు. ఇటీవలనే చంద్రబాబును కలిసిన ఆయన చాలా సేపు సుదీర్ఘంగా అదే విషయం పై మాట్లాడినట్లు తెలుస్తోంది. అమరావతికి, పట్టిసీమకు వ్యతిరేకంగా బీజేపీతో కలిసి వైసీపీ, జనసేన, మిగతా పక్షాలు పోరాడుతున్నా..పెద్దగా ప్రయోజనం లేదనేది ఆ సర్వే సారాంశంగా ఉంది. కృష్ణా, గుంటూరు, ప.గో జిల్లాల్లో టీడీపీ హవాను అవి ఆపలేవంటున్నారు.

టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులపై నియోజకవర్గాల్లో కొంత వ్యతిరేకత ఉన్నా గెలుపు అవకాశాలు బాగానే ఉన్నాయంటున్నారు. నియోజకవర్గాల్లో కనిపిస్తున్న ప్రగతి, రహదారులు, మౌలిక సదుపాయాలు, రైతు రుణమాఫీ ఇవన్నీ సానుకూల ఫలితాలను ఇస్తున్నాయట. మూడో పంట కోసం పొలాలకు నీళ్లు, ఫింఛన్లు, చంద్రబాబు కష్టపడటం, పోలవరం పనులు ప్రస్తావనకువచ్చాయి. కాకపోతే హోదా విషయంలో చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారనే అభిప్రాయం ఉన్నా..కేంద్రం వైఖరితోనే అలా చేశారనే వాదన వస్తుందట. ఇక కేంద్రం సహకరించక పోయినా పనులు జరగడంతో టీడీపీకి సానుకూల అంశమంటున్నారు.

జిల్లాల వారిగా….

తూ.గో….జిల్లా…

2014లో తూ.గోలో టీడీపీ 12, వైసీపీ 5 గెలించిది. ఇందులో వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రు, వలపుల సుబ్బారావు, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు టీడీపీలో చేరారు. ప్రస్తుతం వైసీపీకి ముగ్గురే ఎమ్మెల్యేలు అక్కడ మిగిలారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే తూ.గో జిల్లాలో 19 సీట్లలో టీడీపీ 15, వైసీపీ 3, జనసేన 1 గెలుస్తాయి.

ప.గో జిల్లా….

ప.గో జిల్లాలో ఉన్న సీట్లు 15. అక్కడ టీడీపీ-14, ఒకటి బీజేపీ గెలుచుకున్నాయి. జగన్‌ పార్టీని ఈ జిల్లాలోకి అనుమతించలేదు ప్రజలు. ఒక్క సీటు ఇవ్వలేదు. మున్సిపాల్టీలు అన్ని టీడీపీ చేతిలోనే ఉన్నాయి. ఇప్పుడు ప.గోలో ఉన్న 15 సీట్లలో టీడీపీ 12, వైసీపీ 2, జనసేన 1 గెలుస్తాయని అంచనా.

కృష్ణా జిల్లాలో
ఇక కృష్ణా జిల్లాలో 16సీట్లు ఉన్నాయి. ఇందులో 10 టీడీపీ, బీజేపీ 1 గెలవగా వైసీపీ 5 స్థానాలకే పరిమితం అయింది. వారిలో జలీల్‌ఖాన్‌, ఉప్పులేటి కల్పన టీడీపీలో చేరిపోగా ముగ్గురే ఎమ్మెల్యేలు మిగిలారు. గుంటూరు జిల్లాలోను టీడీపీ మెజార్టీ సీట్లు సాధించుకుంటుందని అంచనా వేస్తున్నారు. అలానే ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి రవి, డేవిడ్ రాజు, పోతుల రామారావు, అశోక్ రెడ్డి టీడీపీలో చేరగా ఉన్న ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు బాలినేని, వైవీ సుబ్బారెడ్డి వర్గాల మధ్య నలిగిపోతున్నారు. ఇప్పుడు అక్కడ ఎన్నికలు జరిగితే టీడీపీ 8, వైసీపీ 4 గెలుస్తాయని తెలిసింది.

నెల్లూరు జిల్లా….
నెల్లూరులో 10 స్థానాల్లో వైసీపీ ఏడు, టీడీపీ మూడు గెలిచాయి. నెల్లూరు జిల్లా గూడురు వైసీపీ ఎమ్మెల్యే సునిల్‌ టీడీపీలో చేరారు. తాజా సర్వే ప్రకారం నెల్లూరు (10) టీడీపీ 6, వైసీపీ 4 గెలుస్తాయంటున్నారు. రాయలసీమలో జగన్ ప్రభావం కొంత మేర ఉన్నా..అనంతపురం, చిత్తూరు జిల్లాలు ఈ సారి టీడీపీకి మెజార్టీ నిస్తాయంటున్నారు. కడప, కర్నూలు సమానంగా వచ్చే వీలుందని తెలుస్తోంది. ఇక ఉత్తరాంధ్రలోను టీడీపీ బలంగా ఉండగా..జగన్ యాత్రల వల్ల పెద్దగా ప్రయోజనం లేదంటున్నారు.

కోస్తాంధ్రలో మొత్తం 89 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 2014లో 28 చోట్ల నెగ్గిన వైసీపీకి ఆపరేషన్‌ ఆకర్ష్‌ తర్వాత ఇప్పుడు 19మందే ఎమ్మెల్యేలు మిగిలారు. 59 సీట్లు గెలిచిన టీడీపీ బలం 68కి పెరిగింది. గతం కంటే టీడీపీ సీట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.