ల‌గ‌డ‌పాటి స‌ర్వే… 10 నియోజ‌క‌వ‌ర్గాల రిజ‌ల్ట్ ఇదే

తెలుగు రాష్ట్రాల్లో లగడపాటి పొలిటికల్ సర్వేలపై కొందరికి గురి ఉంది. కచ్చితమైన రిజల్ట్ వస్తుందనే అభిప్రాయం కూడా ఉంది. ఇందు వల్లనే చాలా పార్టీలు సర్వే ఫలితాల కోసం ఆయన్ను ఆరా తీస్తుంటాయి. ఈసారి ఆయన పేరుతో బోలెడు వార్తలు వచ్చినా.. వాటిని స్వయంగా కొట్టిపారేశారు. నా నోటితో చెప్పిందే నిజం అని స్పష్టం చేశారు. డిసెంబర్ 7వ తేదీ సాయంత్రం మాత్రమే ఏ పార్టీ గెలుస్తుంది అనేది వెల్లడిస్తాను అన్న ఆయన.. తాజాగా ఓ ట్విస్ట్ ఇచ్చారు. ఇండిపెండెంట్, రెబెల్ అభ్యర్థులు 8-10 నియోజకవర్గాల్లో గెలవబోతున్నట్లు చెప్పారు. త‌ద్వారా ఆయా పార్టీల అభ్యర్థుల్లో ముచ్చెమటలు పట్టిస్తున్నారు.
 
మహబూబ్‌న‌గర్ జిల్లా నారాయణపేట నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న శివకుమార్ రెడ్డి గెలవబోతున్నట్లు లగడపాటి జోస్యం చెప్పారు. అదే విధంగా ఆదిలాబాద్ జిల్లా బోథ్ నుంచి అనిల్ జాదవ్ (కాంగ్రెస్ రెబల్) గెలుస్తున్నట్లు ప్రకటించి సంచలనం రేపారు. లగడపాటి ప్రకటనతో ఆయా నియోజకవర్గాల్లో కలకలం చోటు చేసుకుంది. మిగతా పార్టీల్లోనూ చర్చనీయాంశం అయ్యింది. పోలింగ్‌కు వారం ముందు ఇలాంటి ట్విస్ట్ ఇవ్వటంతో.. ప్రధాన పార్టీల అభ్యర్థులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది ఆసక్తి రేపుతోంది. నారాయణపేట, బోధ్ నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్స్ గెలుస్తారని ప్రకటించటమే కాకుండా.. మరో 8 నియోజకవర్గాల్లో గెలవబోతున్న స్వతంత్రుల వివరాలు వెల్లడిస్తాను అని చెప్పటం సంచలనం అయ్యింది. 
 
ఇదిలాఉండ‌గా,  లగడపాటి సర్వే ఫలితాలు ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తాయా.. రావా అనే అందరిలో చర్చనీయాంశం అయ్యింది. పోలింగ్‌కు వారం ముందు సర్వే ఫలితాలను ఎలా వెల్లడిస్తారని ప్రధాన పార్టీల అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. లగడపాటి సర్వేలు ఓటర్లపై ప్రభావం చూపిస్తాయని.. ఇది ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధం అని ఆయా నియోజకవర్గాల ప్రధాన పార్టీ అభ్యర్థులు అంటున్నారు. మిగతా అభ్యర్థుల వివరాలు వెల్లడించకుండా ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి పార్టీలు. ప్రధాన పార్టీల అభ్యర్థులు కాదు అని లగడపాటి ఎలా సమర్ధించుకుంటారని కూడా పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.