చంద్రబాబుకు కంగ్రాట్స్ చెప్పిన లగడపాటి

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ భేటీ అయ్యారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్రం విడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని శపథం చేసిన ఆయన.. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నా ఏపీలో జరుగుతున్న రాజకీయ సమీకరణలను ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు. ఎన్నికల సమయంలో సర్వేల పేరుతో వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఆయనకు సంబంధించిన ఓ వార్త ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

గత వారం టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లగడపాటిల మధ్య భేటీ జరిగిందట. ఈ భేటీ అత్యంత రహస్యంగా జరిగినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో ఏపీకి చెందిన మంత్రులు గానీ, మరే ఇతర రాజకీయ నాయకులు గానీ ఈ భేటీలో పాల్గొనలేదట. వీరిద్దరే ఏకంతంగా చర్చలు జరిపారట. దీంతో వీరిద్దరి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భేటీ ముగిసిన తర్వాత లగడపాటి.. చంద్రబాబుకు ఒక ఫైల్ ఇచ్చి కంగ్రాట్స్ అని చెప్పి వెళ్లిపోయారట.

లగడపాటి వెళ్లిపోగానే బయట ఉన్న మంత్రులు లోపలికి వెళ్లారట. ఇంతలో చంద్రబాబు లగడపాటి ఇచ్చిన ఫైల్ చదువుతూ.. ముసి ముసి నవ్వులు నవ్వుతూ కనిపించారట. ఎప్పుడూ కోపంగా ఉండే చంద్రబాబు అలా నవ్వుతూ కనిపించే సరికి మంత్రులంతా షాక్ అయ్యారట. కొద్దిసేపటి తర్వాత కొంచెం భయం భయంగానే సీఎంను ఎందుకు నవ్వుతున్నారు సార్ అని అడిగారట. దీనికి ‘‘విపక్షాలు షాకయ్యే.. కాదు కాదు మీరు కూడా షాకయ్యే ఫలితాలు రాబోతున్నాయి. ఇక అందరూ ధీమాగా ఉండవచ్చు’’ అని సమాధానమిచ్చారట సీఎం.

అధినేత మాటలతో వారందరికీ లగడపాటి ఎందుకొచ్చారో అర్థమైపోయిందట. కొద్దిరోజుల కిందట సీఎం, లగడపాటి ఆయన నివాసంలో కలిశారట. అప్పుడు ఏపీలో ప్రభుత్వ పథకాల అమలు, ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తమకు ఎన్ని సీట్లు వస్తాయి అనే అంశాలపై సర్వే చేయించవలసిందిగా లగడపాటిని కోరారట సీఎం. దీనికి సరేనన్న లగడపాటి త్వరలోనే నివేదికతో మిమ్మల్ని కలుస్తా అని అక్కడి నుంచి వచ్చేశారట. ఇచ్చిన మాట ప్రకారమే సర్వే చేయించి.. చంద్రబాబుకు నివేదిక ఇచ్చారట.ఇందులో ఆరు జిల్లాలకు సంబంధించిన సర్వే రిపోర్టు ఉందట.

తూర్పుగోదావరి జిల్లా 19 అసెంబ్లీ స్థానాలకు గానూ.. టీడీపీ 15, వైసీపీ 3, జనసేన ఒక స్థానాన్ని గెలుచుకుంటాయట. పశ్చిమ గోదావరిలో 15 స్థానాలకు గానూ.. టీడీపీ 12, వైసీపీ 2, జనసేన ఒక స్థానంలో విజయం సాధిస్తాయట. ఇక కృష్ణా(16), గుంటూరు(17)లో టీడీపీ క్లీన్‌స్వీప్ చేస్తుందట. అలాగే ప్రకాశం జిల్లాలోని 12 స్థానాల్లో టీడీపీ 8, వైసీపీ 4 గెలుచుకుంటాయట. నెల్లూరు జిల్లాలోని 10 స్థానాల్లో టీడీపీ 6, వైసీపీ 4 స్థానాలు గెలుచుకుంటాయని సర్వేలో తేలిందట. చంద్రబాబు నాయకత్వంలోని ఏపీ ప్రభుత్వం చేపట్టిన పట్టిసీమ, రాజధాని నిర్మాణం, వివిధ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం, పోలవరం నిర్మాణం, రెండు, మూడో పంటకు నీటిని అందించడం, బీజేపీని వ్యతిరేకించి ఎన్డీయే నుంచి బయటికి రావడం వంటి వాటి వల్ల టీడీపీ గ్రాఫ్ పెరిగిందని నివేదికలో తేలిందట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.