చంద్రబాబుతో లగడపాటి మంతనాలు

వారిద్దరి మధ్య చాలా సేపు మంతనాలు సాగాయి. ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారో తెల్చి చెప్పాడు వచ్చిన వ్యక్తి. ఇందుకు తన వద్ద ఉన్న సర్వేల సారాంశాన్ని ఆ పెద్దాయన ముందు పెట్టారు. ఫలితంగా ఆయన నిజమేననిచెప్పారట. వారిలో ఒకరు సిఎం చంద్రబాబునాయుడుకాగా..మరొకరు ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్. ఎవరు ఎన్ని అనుకున్నా గతం కంటే బీజేపీ ఏపీలో అట్టడగు స్థానానికి వెళ్లి పోయింది. కాంగ్రెస్ తో సమాన స్థాయికి చేరింది. ఏపీకి ఏం చేయలేదనే ప్రచారాన్ని సాధారణ ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో బాబు సక్సెస్ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకిఅసలు సీన్ ఉండదని అర్థమైంది. అదే సమయంలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే లాభం కంటే నష్టం ఉంటుందని లగడపాటి చెప్పారట. ఇక జగన్ పార్టీకి గతంలో వచ్చినన్ని సీట్లు రావని చెప్పారట లగడపాటి. 
బీజేపీతో పొత్తు తెంచుకోవడం వల్ల 70 శాతం మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారని లగడపాటి తన సర్వేలతో తేల్చి చెప్పారట. అంతే కాదు..పవన్ కల్యాణ్ వల్ల జగన్ పార్టీకి నష్టం జరుగుతుందని..టీడీపీకి కొంత మేర ఇబ్బందేనని ప్రస్తావించారంటున్నారు. గోదావరి జిల్లాల్లో సీట్లను తీల్చడంలో పవన్ పాత్ర ఉంటుందన్నారు. కనీసం ప్రజారాజ్యం పార్టీకి వచ్చినన్ని సీట్లల్లో సగం పవన్ కు రావంటున్నారు. పిచ్చోడి చేతిలో రాయిలా రోజుకో మాట. పూటకో రిసార్ట్ లో పవన్ ఉంటున్నారనే ప్రచారం సాగుతోంది. పవన్ ను కట్టడి చేస్తే తిరిగి టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారట లగడపాటి. అందుకే చంద్రబాబు మరింత ఉత్సాహంతో దూసుకుపోతున్నారంటున్నారు. విపక్షాలు అన్నీ ఏకమైనా తెలుగుతమ్ముళ్లు అభివృద్ధి వైపు తొంగి చూస్తున్నారని చెప్పారట. రాబోయే కాలంలో లగడపాటి ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం సాగుతున్నా..అది నిజం కాదంటున్నారు లగడపాటి. మొత్తంగా ఏపీలో ఇప్పుడు ఎన్నికల ప్రచారం నాటి రాజకీయాలు నడుస్తున్నాయి. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.