కేవీపీ గారు.. భ‌లే అడిగారండీ!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంటే… అంద‌రికీ ఒక రాజ‌కీయ వ‌స్తువు అయిపోయింది. దాని భ‌విష్య‌త్తు గురించి మాట్లాడేవారు లేరు గాని… రాజ‌కీయంగా మాత్రం దానిని వేదిక చేసుకుంటున్నారు. వైఎస్ హ‌యాం నుంచి సోనియాకు ద‌గ్గ‌ర మ‌నుషుల్లో ఒక‌రైన కేవీపీ రామచంద్ర‌రావు గురించి తెలియ‌ని వారు ఉండ‌రు. కేవీపీ వంటి సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కులు నిజాలు దాచ‌బ‌ట్టే కాంగ్రెస్ రాష్ట్ర విభ‌జ‌నను అంత అసంబ‌ద్ధంగా చేసి పారేసింది. విభ‌జ‌న‌తో ఏపీ ఎంత వెన‌క్కు వెళ్లిందో ఎన్నో సాక్ష్యాలు క‌ళ్ల‌ముందే ఉన్నాయి. ప్ర‌శాంతంగా ఉన్న తెలుగు రాష్ట్రాల‌ను నిలువునా చీల్చిన కాంగ్రెస్‌కు తాను ఎంత ఘోర త‌ప్పిదం చేసిందీ ఇన్నాళ్ల‌కు అర్థ‌మ‌య్యి లెంప‌లేసుకునే ప్ర‌త‌య్నం చేస్తోంది. ప్ర‌త్యేక హోదా ఇచ్చి ఆ పాపాన్ని క‌డుక్కోవాల‌ని నిర్ణ‌యించుకుంది.
అయితే… కేవీపీ మాత్రం ఇప్ప‌టికీ త‌న త‌ప్పు తెలుసుకోక‌పోగా కేవ‌లం ప్ల‌కార్డుతో పార్ల‌మెంటుకు హాజ‌ర‌వడం త‌ప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ రాజ‌కీయ వ్యూహాన్ని ఆయ‌న అమ‌లుచేయ‌లేదు. నిజానికి జ‌నాల్లో ఆయ‌న మీద జాలి క‌ల‌గ‌డానికి త‌ప్ప ఆ ప్ల‌కార్డు ఉద్య‌మం ఎందుకు ఉప‌యోగ‌ప‌డ‌లేదు. అలాంటి కేవీపీ ఇపుడు చంద్ర‌బాబుకు ఒక భారీ బ‌హిరంగ లేఖ సంధించారు. నాలుగేళ్ల పాటు భాజపాతో కలిసి ఉన్నా
ప్రత్యేక హోదా సాధనలో చంద్రబాబు ఘెరంగా వైఫల్యం చెందారని విమర్శించారు. దీని కోసం చేసిన పోరాటాలను అణచి వేశారని లేఖలో ఆరోపించారు.
అంతా బాగానే ఉంది గాని… కేవీపీ ప్ర‌త్యేక హోదా కోరుతూ రాష్ట్రంలో ఏం ఉద్య‌మాలు చేశారో చెబితే బాగుంటుంది? రాష్ట్రాన్ని దేశాన్ని నిలువునా ముంచిన మోడీకి లేఖ రాయాల్సిన స‌మ‌యంలో… ఏం చేశావు నాలుగేళ్లు అని చంద్ర‌బాబుకు రాయ‌డంలోనే ఆయ‌న మీడియాను ఎంత డైవ‌ర్ట్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారో అర్థ‌మ‌వుతోంది. ఒక ఎంపీగా ఉన్న కేవీపీ… రాఫెల్‌పై దేశం అట్టుడుకుతుంటే…దానిపై స్పందించ‌కుండా ఉండ‌టంలో అర్థ‌మేంటో వివ‌రిస్తే బాగుంటుంది. కొంప‌దీసి ఆయ‌న మోడీతో ఆంత‌రంగికంగా జ‌త‌క‌ట్టేలేదుగా?

అయినా… రాష్ట్రంలో నాలుగేళ్లు చంద్ర‌బాబు ఏం చేశారో రాష్ట్రంలో ఉండేవారికి తెలుస్తుంది గాని హైద‌రాబాదులో వ్యాపారాలు చేసుకునే కేవీపీకి ఎలా తెలుస్తుంది?

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.