గడ్కరీతో కేవీపీ చర్చ…

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశారు ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, కొత్తపల్లి గీత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, ఉత్తరాంధ్ర చర్చా వేదిక సభ్యులు. పోలవరం పనులు వేగవంతం చేయాలని కోరారు. గతంలోను కేవీపీ ఇలానే కేంద్ర మంత్రిని కలిశారు. పోలవరం పనులు సరిగా జరగడం లేదని హైకోర్టులో పిల్ వేశారు కేవీపీ. రాజ్యసభలోను పలుసార్లు పోలవరం అంశాన్ని ప్రస్తావించారు. కాంట్రాక్టర్లను మారుస్తూ టీడీపీ అక్రమాలకు పాల్పడుతుందనేది ఆయన ఆరోపణగా ఉంది. ఈసారి ఆయనతోపాటు మరికొంత మంది నేతలను గడ్కరీ వద్దకు తీసుకెళ్లారు. పోలవరం నిర్మాణానికి సంబంధించిన లెక్కలను సరిగా చూపించడం లేదనేది బీజేపీ స్థానిక నేతల ఆరోపణ. మేము సక్రమంగానే లెక్కలు ఇచ్చినా కేంద్రం ఆలస్యం చేస్తుందనే ప్రతిస్పందిస్తున్నారు ఇంకోవైపు తెలుగుదేశం నేతలు. కేంద్రం తప్పు చేస్తుంటే మమ్ములను అంటారేంటి అనేది వారి ఆరోపణ. 
సకాలంలో ప్రాజెక్ట్ పూర్తి చేయాలని మేము కోరుతున్నాం అంటున్నారు ఇంకోవైపు కాంగ్రెస్ నేతలు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి జవసత్వం నింపే నేతల కోసం ఎదురు చూస్తోంది ఆ పార్టీ హైకమాండ్. ఇలాంటి సమయంలో కొన్ని కార్యక్రమాలు చేసి ప్రజల దృష్టిలో కనపడేందుకు ప్రయత్నిస్తున్నారు కేవీపీ. తన వాణిని పార్లమెంటులోనే కాదు… బయట వినిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. విశాఖలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ప్రైవేటీకరణ చేయొద్దని తాజాగా కోరారు కేవీవీ. విభజన చట్టంలోని హామీలను కూడా అమలు చేయాలని వారు సూచించారు. 
జగన్ చేసే పనులను వెనుకనుండి కేవీపీ ప్రొత్సహిస్తున్నారనే ప్రచారముంది. నా దారి నేను చూసుకుంటానని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పిన నేపధ్యంలో బీజేపీ-టీడీపీ బంధం తెగుతుందనే సంకేతాలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో గడ్కరీతో కేవీపీ విడిగా భేటీ కావడం కాస్త ఆసక్తికరంగా ఉంది. వైకాపా-బీజేపీ పొత్తుకు కేవీపీ అనధికారికంగా పావులు కదుపుతున్నాడా అనే చర్చ సాగుతోంది. శిల్పా మోహన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి వైకాపాలో చేరే ముందు కేవీపీ ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. అందుకే కేవీపీ పై అనుమానాలు పెరుగుతున్నాయంటున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.