మోడీ-ఆయిల్ కుంభకోణం –

కుటుంబరావు గారు, ఈ రోజు కేంద్రం మీద బయట పెట్టిన మొట్ట మొదటి అవినీతి ఆరోపణకి  పూర్తి వివరాలు,సాక్ష్యాలు. ఈ  ఒప్పందంలో  ఉన్న ఒక రష్యన్  మంత్రి ప్రస్తుతం జెయిల్ లో ఉన్నాడు.

Essar OIL-Roseneft-Trafigura-UCP deal – 82 వేల కోట్ల కాష్ డీల్ – 20 వేల కోట్ల పన్ను ఎగవేత భారీ కుంభకోణం: ఇంతకన్నా పెద్దగా కూడా ఉండొచ్చు

1. గుజరాత్ లో మోడీ ప్రాణ స్నేహితుల కంపెనీ ఎస్సార్ రిఫైనరీ, పోర్ట్ కు దాదాపు రూ 30 వేల కోట్ల బకాయిలు బ్యాంకు కు వున్నాయి. దీనికి రుణ భారం పెద్దగా లేదు. ఎస్సార్ గ్రూప్ కు రూ 1.2 లక్షల కోట్ల కు పైనే రుణాలు వున్నాయి. ఈ మధ్య నే ఎస్సార్ స్టీల్ ను వేలం కూడా వేసారు ఈ మోడీ స్నేహితులని బయటపడేసి, వాళ్ళ పెట్టుబడిని కాపాడడానికి, బ్యాంకులను ముంచడానికి చేయాల్సింది అంతా చేసారు, ఈ రూ 90 వేల కోట్ల లో బ్యాంకు ల అప్పుల తీర్చివేతకు ఎన్ని వెళ్ళాయో, భారత ప్రభుత్వానికి ఎంత పన్ను ఎగ్గోట్టారో , బిజెపి వాళ్లకు కమీషన్లు లో ఎంత వెళ్ళాయో తేలియాలి, తేలాలి. ఇదే అసలు స్కాం, మోడీ మార్క్ కార్పొరేట్ స్కాం.

2. రూ 1.3 లక్షల కోట్ల అప్పుల్లో వున్నా ఎస్సార్ గ్రూప్ ను బెయిల్ అవుట్ చేయడానికి రెండు సంవత్సరాలకు ముందే మోడీ రంగం లోకి దిగి బ్యాంకు లకు సంబందించి, FDI క్లియరెన్సు, RBI, రక్షణ శాఖ, హోం శాఖ తో సహా అన్నీ రకాల అనుమతులు ఆఘమేఘాల మీద ఇప్పించాడు. LIC, PNB ఒప్పుకోలేదు గానీ మోడీనే బలవంతంగా ఒప్పించాడు. పైగా దీనికి రక్షణ, హోం ఆనుమతులు ముందు లేకపోయినా కూడా ఫైల్ కదిలింది, ఇలా లక్ష కోట్ల కాష్ డీల్, ఇందులో ఎవరి వాటా లు ఎంతో తేలాల్సి వుంది.

3. లేదంటే ఎస్సార్ గ్రూప్ విషయంలో, IBC అమలులోకి వస్తే, NCLT కి కేసు వెళితే ఈ ఎస్సార్ ఆయిల్ లేదా గ్రూప్ కంపెనీల షేర్స్ వేలానికి వెళుతుంది. అప్పుడు దక్కేది చాలా తక్కువ వుంటుంది, అది జరగకుండా గుజరాత్ కంపెనీ కావున , తన బినామీ లు కూడా వున్నారు తన అధికారాన్ని దుర్వినియోగం చేసాడు.

4. ROSENEFT అనేది రష్యా ప్రభుత్వ కంపెనీ. Trafigura-UCP అనేది పెట్టుబడుల సంస్థ (బిజెపి పెద్ద మనుషుల బ్లాక్ మనీ ని డీల్ చేసే సంస్థ), ఇది ఎక్కువగా ఇండియా వాళ్ళ బ్లాకు మనీ ని డీల్ చేస్తుంది. ఈ రెండు సంస్థలు చేరో 49% చొప్పున 98% ను కొన్నాయి.

5. ఇదంతా చూస్తు వుంటే ఆయిల్ మాఫియా నే ఈ దేశాన్ని నడిపిస్తుందా అనిపిస్తుంది. ఈ రష్యా మాఫియా కు గోవా కు మధ్య ఉన్న లింక్ లు కూడా తేలాల్సి వుంది. పుతిన్ – మోడీల ల బ్లాకు మనీ నే ఈ డీల్ లో ప్రవహించి వుంటుంది, దీనిలో సందేహం లేదు.

6. ఎస్సార్ గ్రూప్ కు చెందినా రుయా లు 2G స్కాం లో వున్నారు, తరువాత మోడీ బయట పడేసాడు, వోదాఫోన్ – ఎస్సార్ టెలికాం డీల్ లో రూ 15 వేల కోట్ల టాక్స్ నోటీసు కేసు కూడా వుంది, అది ఇప్పుడు ఏమైనదో తెలియదు. CBI కేసుల్లో వున్నప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు విదేశాలకు వెళ్ళడానికి మోడీ అనుమతి ఇచ్చేవాడు. విదేశాల్లో తరచుగా మోడీ – రుయాలు మీటింగ్ లు పెడతారు,రుయాల ఫ్లైట్ లలో మోడీ తిరుగుతాడు, ఇంకా ఇలాంటివి చాలా వున్నాయి, ఇవన్నీ కూడా కేసుల్లో ఉన్నప్పుడే.

7. ఎస్సార్ – వోడాఫోన్ డీల్ లో లాగా కాకుండా ( కంపెనీ ఇండియా లో వున్నా కూడా డీల్ విదేశాల్లో రెండు విదేశీ కంపెనీల మధ్య జరిగింది, మారిషస్ ట్రీటీ వుంది కావున ఇండియా లో కాపిటల్ గైన్ టాక్స్ కట్టము అనే కేసు ఇంకా నడుస్తోంది) ఇప్పుడు కూడా ఇండియా లో కాపిటల్ గైన్ టాక్స్ తప్పించుకోడానికి, 2015 లోనే డీల్ కు ముందే విత్ హోల్డింగ్ టాక్స్ మినహాయింపు కు ఎస్సార్ ముంబై టాక్స్ డిపార్టుమెంటు లో దరఖాస్తు చేసింది. నో డిడక్షన్ సర్టిఫికేట్, మారిషస్ ట్రీటీ ( ఎస్సార్ ఆయిల్ మారిషస్ లో వుంది) ప్రకారం పన్ను మినహాయింపు కూడా అడిగారు, ఇది సాధారణం గా ఎస్సార్ ఆయిల్ లాంటి కంపెనీకి ఇవ్వకూడదు, ఇక్కడ ఏమి జరిగిందో?

8. మారిషస్ ట్రీటీ మార్చ్ 31 2017 తోనే ముగిసింది, కానీ ఈ డీల్ మాత్రం ఎప్పుడు ప్రారంభం అయినా కూడా ఆగష్టు 2017 లోనే పూర్తి అయ్యింది, అదికూడా మోడీ, పుతిన్ ల సమక్షం లోనే. ఇప్పుడు మారిషస్ తో 2017 మార్చ్ 31 తర్వాతా టాక్స్ ట్రీటీ లేదు ఎస్సార్ ఆయిల్ కూడా రూ 15 వేల కోట్ల టాక్స్ కట్టాల్సి వుంటుంది, విచిత్రం గా income  టాక్స్ డిపార్టుమెంటు కూడా ఇప్పటికీ మిన్నకుండా వుంది !

9. ఎస్సార్ ఆయిల్ పై రుయాలు పెట్టిన పెట్టుబడి 15 వేల కోట్లే, కానీ రోసేనేఫ్ట్ & పార్టనర్స్ కు అమ్మింది దాదాపు 90 వేల కోట్ల కు అంటే దాదాపు రూ 75 వేల కోట్ల లాభం అనుకుంటే దీనిపై కాపిటల్ గైన్ టాక్స్ 20% చొప్పున దాదాపు రూ 15 వేల కోట్ల కు పైనే, ఇది చాలా పెద్ద కుంభకోణం. ఇదే విధం గా ఎస్సార్ – వోడాఫోన్ డీల్ తో ఎస్సార్ కు అనుకూలం గా మోడీ వ్యవహరించి వాళ్లకు రూ 20 వేల కోట్ల పన్ను ను ఈ కార్పొరేట్ లకు మిగిల్చాడు,దేశానికి బొక్క పెట్టాడు. రిలయన్స్ కన్నా రెట్టింపు విలువ ఈ ఎస్సార్ ఆయిల్ కి ఎలా ఇచ్చారో అర్ధం కావడం లేదు, అంటే మారిషస్ నుండి ఇండియా బ్లాకు మనీ ని ఇలా ఎక్కువ విలువకి తెచ్చి తెల్ల డబ్బు గా మారుస్తున్నారు.

10. ఎస్సార్ ఆయిల్ ను 2015 లో BSE నుండి డీలిస్ట్ చేసేటప్పుడు అప్పుడు షేర్ హోల్డర్స్ కు ఒక్కో షేర్ కు రూ 280 ఇచ్చారు, అప్పుడే SEBI చెప్పింది, మున్ముందు ఎక్కువ ధరకు షేర్ అమ్మితే ఆ మిగిలిన మొత్తాన్ని ఈ మైనారిటీ షేర్ హోల్డర్స్ కి ఇవ్వాలి అని, ఇప్పుడు రూ 380 కి అమ్ముకున్నారు. ఈ మొత్తమే దాదాపు రూ 1800 కోట్ల కు పైనే వుంది దీనిని కూడా మోడీ సాయం తో ఎగ్గొట్టడానికి ప్లాన్ చేసారు.

11. ఈ డీల్ లో పెట్టుబడి కన్నా 5 రెట్లు ఎక్కువ విలువ పలికించారు కావున, ఈ డీల్ లో వచ్చిన 90 వేల కోట్లు లో కూడా చాలా వరకు బిజెపి వాళ్ళ నల్లధనమే వుంటుంది, దీనికి రష్యా అద్యక్షుడు పుతిన్, మారిషస్ లో వుండే షెల్ కంపనీల సాయం తీసుకున్నారు. ఈ డబ్బులో ఎక్కువ మోడీ జేబుల్లోకి, బిజెపి కి ఎలక్షన్ ఫండ్ గా వెళ్ళే అవకాశం  వుంది, రుయాలు దేశం బయటే వుంటారు కావున, ఇక బిజెపి వాళ్ళ ఇష్టం, ఎంత కమీషన్ లు తీసుకుంటారో వాళ్ళకే తెలియాలి, అందుకే ఈ మధ్య పార్టీ లకు విదేశాల నుండి వచ్చే విరాళాల వివరాలు తెలుపనవసరం లేదు అని ఎలక్షన్ కమీషన్ చేత కూడా చెప్పించారు, ఇప్పటికే బిజెపి కి రూ 2 వేల కోట్ల విరాళాలు వచ్చాయి.

12. ఇంకా ఈ ఎస్సార్ ఆయిల్ రిఫైనరీ కి, పోర్ట్ కు ఎన్ని వేల కోట్ల ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్ డ్యూటీ మినహాయింపు లు దొంగచాటుగా ఇచ్చారో, ఇస్తున్నారో, అలాంటి అవకాశం  కల్పిస్తారో ( SEZ,CEZ, EOU ముసుగులో) చూడాలి. మొత్తానికి ఎస్సార్ పేరుతొ దేశ ఖజానాకు దాదాపు 50 వేల కోట్ల బొక్క పెట్టిన ఘనత ఈ మోడీ దే. అంతే కాకుండా, ఈ FDI ల పెట్టుబడులకు రిటర్న్స్ గారంటీ స్కీం ను కూడా మోడీ రెడీ చేసాడు, త్వరలో చట్టం చేస్తాడుకూడా, అంటే విదేశీ పెట్టుబడుల కు నష్టం రాకుండా, ఒక వేళ నష్టపోతే గవర్నమెంట్ నష్ట పరిహారం చెల్లించేటట్టు అన్నమాట.

దీనికి సంభందించి జాతీయ మీడియాలో వచ్చిన కథనాలు-

     

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.