ఆ జాబితాలో చేరిపోయిన కుటుంబ‌రావు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఎంతో హుందాగా మెలుగుతున్న‌ప్ప‌టికీ సొంత‌పార్టీలోని వారే అత‌న్ని ఇరుకున పెడుతున్నార‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఒక‌వైపు బాల‌య్య‌, మ‌రోవైపు లోకేష్ త‌మ విప‌రీత వ్యాఖ్య‌లు, చ‌ర్య‌ల‌తో పార్టీకి చెడ్డ‌పేరు తెస్తుండ‌గా, ఇప్ప‌డు ఆ జాబితాలో రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారు కుటుంబ‌రావు చేరిపోయారు. కుటంబరావు తన తాజా మాటలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. కుటుంబరావు ఇటీవ‌ల మీడియాతో భేటీ అయిన‌ప్ప‌డు రాష్ట్రానికి ఇస్తున్న నిధుల విషయంలో కేంద్రం చెబుతున్న మాటలన్నీ బూటకాలే అని కొట్టి పారేశారు. సాగరమాల ప్రాజెక్టుకు  5 కోట్లు ఇచ్చి 1800 కోట్లు ఇచ్చినట్టుగా చెప్పుకుంటున్నారని,  రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం 3750 కోట్లు ఖర్చు పెట్టిందని పేర్కొన్నారు రాష్ట్రం- కేంద్రం పరస్పరం చేసుకుంటున్న విమర్శలకు సంబంధించిన ఆయ‌న‌ ‘‘కేంద్రానికి మేం రాసిన ఉత్తరాలు  చూపిస్తారుగానీ, కేంద్రం రాష్ట్రానికి రాసిన ఉత్తరాలు ఎందుకు చూపించరని కుటుంబ రావు నిలదీశారు. ఇది చాలా స‌రైన అంశ‌మే అయిన‌ప్ప‌టికీ…  ప్రజలకు మ‌రో కోణంలో సందేహాలు క‌లుగుతున్నాయి. కుటుంబ‌రావు నిరంత‌రం ‘కేంద్రం… రాష్ట్రానికి రాసిన లేఖల్ని కూడా చూపించండి’ అని అడిగేందుకు బదులు… ఎలాగూ ఆ ఉత్తరాలు రాష్ట్రం వద్దనే ఉంటాయి గనుక.. వాటిని స్వ‌యంగా బ‌య‌ట‌పెట్టి… ఆ ఉత్తరాల‌తో కేంద్రం బండారాన్ని బ‌య‌ట‌పెట్ట‌వ‌చ్చుగా అని ప్ర‌శ్నిస్తున్నారు.

 

కేంద్రం రాసిన ఉత్తరాలు వాళ్లే బయటపెట్టాలని కుటుంబరావు ఎందుంటున్నారో ఎవ‌రికీ అర్థం కావ‌డంలేదు. ఇదిలావుండ‌గా పోలవరం అంచనాల పెంపు వ్యవహారాల దగ్గర్నించి అనేక అంశాల్లో కేంద్రం లేవనెత్తిన సందేహాలకు సకాలంలో సమాధానాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేసింద‌నే ఆరోప‌ణ‌లున్నాయి. ఈ నేప‌ధ్యంలో కుటంబ రావు మాటలతో బాబు సర్కారు మీద అనుమానాలు పెరుగుతున్నాయని  విశ్లేష‌కులు అంటున్నారు. ఇదిలావుండ‌గా చంద్రబాబునాయుడుకు, కేంద్రప్రభుత్వానికి మధ్య ఇప్పుడు చాలా అంశాల‌లో యుద్ధమే జరుగుతోంది. టీడీపీకి  రాష్ట్రంలో బలం ఉన్నదని నిరూపించేదుకు బాబు నిరంత‌రం ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే దీనికి కౌంటర్ గా బాబు వైఫల్యాలను ఎత్తిచూపేందుకు బీజేపీ నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. టీడీపీ వ్యూహకర్త, రాష్ట్ర ప్రభుత్వ‌ సలహాదారు, ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు అయిన కుటుంబ‌రావు ఇప్ప‌టికైనా ప్ర‌జ‌ల సందేహాలు తీర్చాల్సిన అవ‌స‌రం ముందని ప‌లువురు అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.