ఫలించిన కేటీఆర్ ప్రయత్నం.. తెలంగాణకు పెట్టుబడులు

వరంగల్లో టెక్ మహెంద్ర సెంటర్ ఏర్పాటుకు గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్ర అంగీకరించారు. దావోస్ పర్యటనలో ఉన్న కేటీఆర్.. ఆ కంపెనీ ప్రతినిధులతో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. అందుకే ఆ కంపెనీ ముందుకు వచ్చింది. తెలంగాణ సర్కార్ అందిస్తున్న ప్రోత్సహకాలను మహీంద్ర గ్రూప్ చైర్మన్ కు వివరించారు కేటీఆర్. ఎయిరో స్సేస్ దిగ్గజం లాక్ హీడ్ మార్టిన్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు రిచర్డ్ అంబ్రోస్ తోనూ కేటీఆర్ సమావేశం అయ్యారు. స్పేస్ విభాగంలో పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన ఈకో సిస్టమ్ హైదరాబాద్ లో ఉందని చెప్పారు. యూనిట్ పెట్టేందుకు లాక్ హీడ్ మార్టిన్ ప్రతినిధులు సానుకూలంగా ఉన్నారు. అంతే కాదు… బల్గేరియా టూరిజం శాఖ మంత్రి నికోలినా అంగేల్ కోవాతో స్టార్ట్ అప్, ఇన్నోవేషన్, టూరిజం రంగాల్లో ప్రమోషన్ పైన చర్చించారు. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్యానెళ్ల తయారీ సంస్ధ ట్రినా సోలార్ ఉపాధ్యక్షులు రొంగ్ ఫాంగ్ యిన్, ఫిలిప్స్ సంస్థ ప్రతినిధులు, అబ్రాజ్ గ్రూపు మేజేజింగ్ పార్టనర్ కీటో డి బోయర్ లతో పాటు పలు కంపెనీల ప్రతినిధులతో చర్చించారు కేటీఆర్. 
ఫైజర్ వాక్సిన్ అధ్యక్షురాలు సుసాన్ సిలబెర్మన్ తో కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హైదరాబాద్ నగరం ప్రపంచ వ్యాక్సినేషన్ మ్యాన్యూఫాక్చరింగ్ హబ్ లలో ఒకటిగా ఉందని, దాదాపు 25 శాతం ప్రపంచ వ్యాక్సిన్లు ఇక్కడే తయారు అవుతున్నాయని మంత్రి సుసాన్ కు తెలిపారు. నగరంలో ఉన్న జినోమ్ వ్యాలీ, ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీల గురించి వివరించారు. ఫైజర్ సంస్ధ వాక్సిన్ ఉత్పత్తి కేంద్రాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయాని కోరారు. ఇందుకోసం అవసరం అయిన అధ్యయనానికి ఫైజర్ బృందాన్ని తెలంగాణకు పంపాలని కోరడం చర్చనీయాంశమైంది. 
చంద్రబాబు సలహాలు….
హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధి చెందిందంటే కారణం చంద్రబాబునాయుడే. ఈ సంగతి అందరి ముందు చెప్పాడు కేటీఆర్. అందుకే ఎంతో అనుభవం ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసిన తర్వాత కేటీఆర్ ఆ రేంజ్ లో దూసుకుపోతుండటం విశేషమే. లోకేష్ బర్త్ డే నాడు చంద్రబాబును కలిసి మరీ పలు సలహాలు, సూచనలు తీసుకున్నారు కేటీఆర్. అందుకే దావోస్ సదస్సులో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్, అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదాని, బజాజ్ గ్రూప్ చైర్మన్ రాహుల్ బజాజ్, హీరో మోటో కార్ప్ సిఈవో పవన్ ముంజాల్, ఉదయ్ కోటక్, వెల్ స్పన్ గ్రూపు చైర్మన్ బికె గోయెంకా, కేంద్ర మంత్రి ధరేంద్ర ప్రధాన్ ను కలిశారు మంత్రి కేటీఆర్. ఫిన్లాండ్ రాజధాని హెల్సింకీ లో జరిగే అతిపెద్ద స్టార్ట్ అప్ అండ్ టెక్ ఈవెంట్ ను ఈ సారి హైదరాబాద్ లో నిర్వహించేందుకు తెలంగాణ పావులు కదుపుతోంది. ఫలితంగా పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.