కేటీఆర్ లాజిక్కులు చూస్తే అవాక్కవుతారు

‘‘ఓటర్ల జాబితాలో లక్షల మంది పేర్లు గల్లంతు కావడం వల్ల టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు చాలా చోట్ల మెజారిటీ తగ్గింది.. అదే జరగకపోయి ఉంటే ఒక్కో అభ్యర్థికి 70 వేల పైచిలుకు మెజారిటీ వచ్చేది’’ ఆదివారం ఆదివారం కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, పద్మారావు నిర్వహించిన టీఆర్‌ఎస్‌ విజయోత్సవ సభల్లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలివి. ఇటీవల ముగిసిన ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయం సాధించింది. ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీ నేతలే ఆశ్చర్యపోయేలా ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ప్రజాకూటమి ఘోర వైఫల్యం చెందింది. ఆ పార్టీలోని కొందరు సీనియర్ నేతలు ఘోరంగా ఓడిపోయారు. కాంగ్రెస్ 19 స్థానాల్లో, టీడీపీ రెండు చోట్లు మాత్రమే విజయం సాధించగా, కూటమిలోని మిగిలిన రెండు పార్టీలు తెలంగాణ జనసమితి, సీపీఐ ఒక్క చోట కూడా గెలుపొందలేకపోయాయి. ఇక, మిగిలిన పార్టీలలో భారతీయ జనతా పార్టీ.. 118 స్థానాల్లో పోటీ చేస్తే 103 నియోజకవర్గాల్లో డిపాజిట్లు కోల్పోయింది. ఆ పార్టీకి ఈ ఎన్నికలు పీడకలను మిగిల్చాయి. బీఎల్ఎఫ్ కూడా ఖాతా తెరవలేదు. ఎంఐఎం మాత్రం తన సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకుంది.

ఈ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రమాణ స్వీకారం చేశారు. మిగిలిన ఎమ్మెల్యేలతో ఇంకా ప్రమాణ స్వీకారం చేయించలేదు. అలాగే మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. కానీ, ఆయన కుమారుడు కల్వకుంట్ల తారక రామారావుకు మాత్రం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింగ్‌గా బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేయగా, కేటీఆర్ మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని చూస్తున్నాడు. ఇందులో భాగంగానే ఆయన పలు చోట్ల విజయోత్సవ సభలు ఏర్పాటు చేస్తున్నాడు. ఆదివారం కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన సభల్లో కేటీఆర్ చేసిన ప్రసంగం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతవడం వల్లే చాలా చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థుల మెజారిటీ తగ్గిందన్నాడు. అంటే.. కేటీఆర్ లెక్కలో టీఆర్ఎస్ ఫాలోవర్ల ఓట్లే జాబితా నుంచి గల్లంతైనట్లు చెబుతున్నాడు. అంటే ప్రతిపక్షాలకు చెందిన చాలా మంది అభ్యర్థులు వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయారు. మరి ఓట్లు గల్లంతవకపోతే వాళ్లు కూడా విజయం సాధించేవాళ్లేగా.. ఈ విషయాన్ని కేటీఆర్ ఎందుకు మరిచిపోయాడో..!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.