కేటీఆర్‌… హ‌రీష్‌.. క‌విత‌… వార‌సులెవ‌రు!

జాతీయ రాజ‌కీయాల్లోకి నేను రెడీ అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు బాగానే ఉంది. ప్ర‌ధాని అభ్య‌ర్థిగా ద‌క్షిణాధి నుంచి కేసీఆర్ డ‌బుల్ ఓకే. మ‌రి.. గులాబీ గూటి నుంచి సీఎం అభ్య‌ర్థి ఎవ‌రు? గ‌త ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చిన‌ట్లు ద‌ళితుల‌ను సీఎం చేస్తారా! అబ్బే అదెలా కుదురుతుందండీ అంటారా! పోనీ.. వార‌సులున్నారుగా అంటే.. వారిలో ఎవ‌రికి ప్రాధాన్య‌త‌నిస్తారు. ఇవ‌న్నీ టీఆర్ ఎస్ పార్టీలో రేగుతున్న అనుమానాలు. కేసీఆర్ సీఎంగా ఉంటే ఓకే.. ఎవ‌రికీ అభ్యంత‌రం లేదు. కానీ.. ఆయ‌న పీఎంగా కేంద్రానికి వెళితే.. వందేళ్ల కాంగ్రెస్‌ను.. బ‌ల‌మైన టీడీపీను.. బీజేపీను ఎలా త‌ట్ట‌ుకుంటారు. అంద‌ర్నీ క‌ల‌పి తిప్పికొట్ట‌గ‌ల రాజ‌కీయ ఉద్దండులు టీఆర్ ఎస్‌లో ఎవ‌రున్నారు. లాంత‌రు పెట్టి వెతికినా కేసీఆర్ తో స‌రితూగ‌గ‌ల నేత లేర‌నేది సొంత‌పార్టీ ఆలోచ‌న‌. పోనీ.. వార‌సులుగా కుమారుడు కేటీఆర్‌, కూతురు క‌విత‌, అల్లుడు హ‌రీష్‌రావు వీరిలో ఎవ‌రు సీఎం అభ్య‌ర్థి అనే అనుమానాలు లేక‌పోలేదు. అందుకేనేమో.. నిజామాబాద్ ఎంపీగా వున్న క‌విత‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా బ‌రిలోకి దిగాల‌నే విష‌యాన్ని త‌న అనుచ‌రుల‌తో త‌ర‌చూ చ‌ర్చిస్తూ వ‌చ్చారు. కేటీఆర్ కూడా.. మూడేళ్లుగా అన్నీ తానై చ‌క్రం తిప్పుతున్నారు. గ్రేట‌ర్ వంటి మున్సిపల్ కార్పొరేష‌న్ నుంచి సిద్ధ‌ిపేట నియోజ‌క‌వ‌ర్గం వ‌ర‌కూ ప‌ట్టునిలుపుకునే ప్ర‌య‌త్నాలు సాగిస్తూనే ఉన్నారు. హ‌రీష్‌రావు రాజ‌కీయాల్లో ఎటువంటి ప్ర‌త్య‌ర్థుల్లేని నేత‌. కార్య‌క‌ర్త‌ల‌కే కాదు.. నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కూ అత్యంత ఆప్తుడు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో సీఎంగా ఎవ‌రైతే బావుంటుందంటూ.. ఓ సంస్థ చేప‌ట్టిన సర్వేలో కేసీఆర్‌, హ‌రీష్ అంటూ జ‌నం త‌మ అభిప్రాయం వెలిబుచ్చారు. అప్ప‌ట్లోనే దాదాపు 25-30శాతం మంది ముఖ్యంగా యువ‌త హ‌రీష్‌కే ఓటేయ‌టం ఇందుకు నిద‌ర్శ‌నం. అటువంటి బ‌ల‌మైన నేత హ‌రీష్ కొద్దికాలంగా కేవ‌లం త‌న నియోజ‌క‌వ‌ర్గానికే పరిమిత‌మ‌య్యారు. ఏదైనా అంటే.. అబ్బే సాగునీటి ప్రాజెక్టుల ప‌నిలో బిజీగా వున్నారంటూ స‌ర్దిచెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.