గ్రామాలపై కెసీఆర్ కన్ను….

వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు,ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు పావులు  కదుపుతున్నారు. ఇందుకోసం గ్రామస్ధాయి నుంచి పార్టీని పటిస్టం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఇప్పటికే తెలంగాణలో పంచాయతీల సంఖ్యను పెంచిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అక్కడ వివిధ అభివ్రద్ధి పనులను దగ్గరుండి చూసుకుందుకు గ్రామ కార్యదర్శులను కూడా నియమించారు. వారికి నెలకు 15 వేల రూపాయల వేతనాన్నికూడా నిర్ణయించారు. దీంతో ఆ కార్యదర్శులంతా ప్రభుత్వ ఉద్యోగుల్లా కాకుండా
తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తల్లా పని చేయాలన్నది కె.చంద్రశేఖర రావు వ్యూహం.

ఇప్పుడు కొత్తగా ఆగస్టు 15 తేదీ నుంచి పల్లెకు పోదాం పేరుతో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. మూడు నెలల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తొలి నెలలో గ్రామాల పరిశ్రుభ్రతకు ప్రాధాన్యం ఇస్తారు. ఇందులో భాగంగా గ్రామాల్లో ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన గుంతలను పూడుస్తారు. ప్రతి గ్రామంలోనూ ధోబీఘాట్ నిర్మాణంతో పాటుశశ్మనాన్ని వాటికలు కూడా ఏర్పాటు చేస్తారు. దీని వెనుక గ్రామలను బాగు చేయడంతో పాటు గ్రామస్ధుల ఓట్లను కొల్లగొట్టే వ్యూహం కూడా ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆగస్టు 15 తేదీ నుంచి ఈ కార్యక్రమాన్నిప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఎన్నికల వరకూ దీన్ని కొనసాగిస్తారు. వచ్చే సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అదే ఖరారు అయితే ఫిబ్రవరి నెలాఖరు నాటికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అంటే ఆగస్టు నెల నుంచి ఫిబ్రవరి వరకూ ఆరు నెలల పాటు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు, నాయకుల అందరూ గ్రామాలకే పరిమితమవుతారు. గ్రామాలను బాగు చేయడంతో పాటు క్షేత్ర స్ధాయిలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటారు. గ్రామాల్లో చిన్న పాటి అభివ్రద్ధి జరిగినా అమాయక గ్రామీణులు దాన్ని మరచిపోరన్నది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు నమ్మకం. గాంధీజీ సిద్ధాంతాలను ఔపోసన పట్టిన కె.చంద్రశేఖర రావు ఆయన చూపిన బాటలోనే పయనించాలని భావిస్తున్నారు. అయితే ఇది అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం కావడం గమనార్హం. గ్రామాలను శుభ్రంగా ఉంచడం, గ్రామస్థుల కనీస అవసరాలను తీర్చడం వల్ల వారంతా తెలంగాణ రాష్ట్ర సమితి వైపు ఆకర్షితులవుతారని ముఖ్యమంత్రి నమ్మకంగా ఉన్నారు.  ఇదే విషయాన్ని పార్టీ నాయకుల వద్ద కూడా ప్రస్తావించినట్లు చెబుతున్నారు. తెలంగాణలో రాహుల్ గాంధీని తీసుకువచ్చి బస్సు యాత్రల ద్వారా పార్టీని పటిష్ట పరచాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీని దూకుడును నిలువరించేందుకు
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వేసిన ఈ పాచిక ఎంత వరకూ ఫలిస్తుందో తెలియాలంటే ఎన్నికల వరకూ ఆగాల్సిందే. అయితే, ఎన్నికల్లో విజయం కోసం ఇప్పటి నుంచే వ్యూహ రచన చేస్తున్న ముఖ్యమంత్రిని ఎదుర్కోవడం
ప్రతిపక్షాలకు సాధ్యమవుతుందో లేదో తేలాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.