కేసీఆర్ కి దిమ్మ తిరిగిందిగా..

ఇంకా ఎన్నికలే జరగలేదు అప్పుడే షాక్‌ ఏంటి అనుకోకండి. అధికార పార్టీ ఎంపీ రాజీనామా చేస్తారని ఇప్పటికే ప్రచారం జరిగింది. దాన్ని ఆ ఎంపీ ఖండించారు కూడా.. అయితే చేవెళ్ల ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వరరెడ్డి టీఆర్‌ఎస్‌లో ఇమడలేని పరిస్థితి ఏర్పడింది. జిల్లా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డితో ఆయనకు అసలు పడటం లేదట.. ఈ వివాదం 2014 ఎన్నికల అనంతరమే మొదలైనా ఎప్పటికప్పుడు కేటీఆర్‌ లేదా కవిత ఇలా ఎవరో ఒకరు మధ్యవర్తిత్వం చేసి సరిపెట్టేవారు. ఆ తరువాత కొంత మేర సర్దుమణిగినా తిరిగి వివాదం చెలరేగుతూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన తరుణంలో పార్టీ మారడానికి ఇదే మంచి సమయమని ఎంపీ భావించారు. పార్టీకి, ఎంపీ అభ్యర్థిత్వానికి కూడా రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయం పలు మీడియా సంస్థల్లోనూ వచ్చాయి. దాన్ని బహిరంగంగా ఆయన ఖండించారు.

అయినా నివురు కప్పిన నిప్పులా ఉన్న ఈ అంశం ఎన్నికల మందు తమ పార్టీకి నష్టం చేస్తుందని భావించిన టీఆర్‌ఎస్‌ పెద్దలు వెంటనే ఆయిన్న సంప్రదించి బుజ్జగించారు. కనీసం ఎన్నికల అయ్యేవరకు తన నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని కూడా కోరారని తెలుస్తోంది. ఆరు నెలల నుంచి ఆయన కాంగ్రెస్‌ అధిష్ఠానంతో టచ్‌లోనే ఉన్నారట… ఆ విషయం తెలిసిన తరువాత ఆయన్ని వెళ్లదని చెప్పడం కన్నా తమకు అనుకూలమైన సమయంలో వెళితే సరిపోతుందని కోరారట. వెళ్లేవాడిని వెళ్లొదని కాకుండా కొంతకాలం ఆగాలని కోరడం మరింత ఆగ్రహం తెప్పించిందట.. గతంలో తన ముఖ్యమైన అనుచరులు పైలెట్‌ రోహిత్‌ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడం వెనుక మహేందర్‌రెడ్డి ఉన్నారని ఆయన బలంగా నమ్మారు. అదే విషయం పదేపదే పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా స్పందించని వారు ఇప్పుడు తనను ఏ రకంగా అడుగుతారని సన్నిహితుల దగ్గర వాపోయారట.. కాంగ్రెస్‌తో ఆయన సన్నిహిత సంబంధాలు నెరుపుతూ పైలెట్‌ రోహిత్‌రెడ్డికి కాంగ్రెస్‌ నుంచి తాండూరు టికెట్‌ ఇప్పించడంలో విశ్వేశ్వరరెడ్డి కీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది. అంటే తన ప్రత్యర్థి పట్నం మహేందర్‌రెడ్డిపైనే తన అనుచరుడిని గెలిపించాలని లక్ష్యం పెట్టుకోవడం తెలుస్తూనే ఉంది. దానితోపాటు తనకు బాగ నమ్మకస్తుడైన కెఎస్‌ రత్నాకి కూడా చేవెళ్ల నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ వచ్చేలా తెరవెనుక చక్రం తిప్పారు. సరిగ్గా ఎన్నికల ముందు పార్టీని వీడితేనే తమ వర్గానికి ప్రయోజనం ఉంటుందని ఆయన భావించారు. అనుకున్న విధంగా మూడు పేజీల రాజీనామా లేఖ రాసి, దాంట్లో తన ఆవేదన అంతా వ్యక్తం చేశారు. తనని మొదటి నుంచి ఎలా చిన్నచూపు చూసింది.. ఓడిపోయే సీటు కాబట్టి తనకి ఏ సమయంలో ఇచ్చారు వంటివి కూడా అందులో పేర్కొనడం గమనార్హం. ఏది ఏమైన ఎన్నికల ముందు కొండా ఇచ్చిన షాక్‌కు టీఆర్‌ఎస్‌కు దిబ్బతిరిగిపోయిందనే చెప్పాలి. మరి చూడాలి ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపుతుందో..

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.