కోమ‌టిరెడ్డికి జ్ఞానోద‌య‌మైందోచ్‌!

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌.. న‌ల్గొండ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డికి కాలం క‌ల‌సిరావ‌ట్లేదు. పీసీసీ చీఫ్ కోసం నానాతంటాలు ప‌డినా ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. రాహుల్‌గాంధీ దృష్టిలో ప‌డి.. క్రేజ్ సంపాదించేందుకు చేసిన ప్ర‌య‌త్నాలు బెడ‌సికొట్టాయి. చివ‌ర‌కు అసెంబ్లీలో చేసిన నానాయాగీ.. చివ‌ర‌కు ఆయ‌న ఎమ్మెల్యే ప‌ద‌వికే ఎస‌రు పెట్టిన‌ట్ట‌యింది. చివ‌ర‌కు కోర్టుకు వెళితే త‌ప్ప ప‌ద‌విని కాపాడుకోలేని దుస్థితి. దీనిపై టీఆర్ ఎస్ మ‌రోసారి పిటీష‌న్ దాఖ‌లు చేయ‌బోతుండ‌టంతో రెడ్డిగారికి ఝ‌ల‌క్ ప‌డిన‌ట్ల‌యింది. వాస్త‌వానికి కోమ‌టిరెడ్డి ముప్పై ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఒడిదొడుకులు.. వ‌ర్గ‌పోరులో బాగానే చితికిపోయారు. కుమారుడు మ‌ర‌ణంతో మ‌రింత దెబ్బిన్నారు. మాన‌సికంగా కృంగిపోయారు. ఆ త‌రువాత తేరుకుని.. మ‌ళ్లీ రాజ‌కీయాల్లో క్రియాశీల‌కంగా మారారు. అన్నింటినీ మించి.. ఎప్ప‌టి నుంచో ఆయ‌న‌కు రాష్ట్ర పార్టీ అధ్య‌క్షుడిగా చ‌క్రం తిప్పాల‌ని ఉండేది. కానీ.. ఏపీతో క‌ల‌సివున్న స‌మ‌యంలో ఆ ముచ్చ‌ట తీర‌లేదు. పోనీ.. తెలంగాణ రాష్ట్రంలో అయినా మురిపెం తీరుతుందంటే అదీ కుద‌ర‌ట్లేదు. పైగా.. ఎమ్మెల్యేగా భ‌ర్త‌ర‌ఫ్‌.. పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డితో వైరం.. సీనియ‌ర్ల‌తో త‌ల‌నొప్పులు చ‌విచూస్తున్నారు. ఇటీవ‌ల ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌కు 2019లో అధికారం గ్యారంటీ అంటూ స‌ర్వే లెక్క‌లు బ‌య‌ట‌పెడితే.. అబ్బే.. హ‌స్తం పార్టీకు అంత‌సీను లేదంటూ స‌ర్వేను.. ఉత్త‌దే అన్న‌ట్లుగా ప్ర‌చారం చేసి టీఆర్ ఎస్‌నెత్తిన పాలు పోశారు.
మే 22న పుట్టిన‌రోజు జ‌రుపుకున్న కోమ‌టిరెడ్డి.. త‌న మ‌న‌సులో మాట వెళ్ల‌గ‌క్కారు. న‌ల్గొండ ఎమ్మెల్యేగా తానే ఉన్నానంటూ కేసీఆర్ రాసిన లేఖ‌ను చూపాల్సిన ప‌రిస్థితికి వ‌చ్చింది. ఉత్త‌మ్‌తోనే ఇబ్బంది అనుకుంటే.. త‌న‌కు పోటీగా రేవంత్‌రెడ్డి దూకుడు కాస్త ఇబ్బందిగా అనిపిచ్చిన‌ట్టుంది. అందుకే.. ముప్పై ఏళ్లుగా ఉన్న‌నాకే దిక్కులేదు.. ఇక మీకు ఎక్క‌డంటూ వ్యంగాస్త్రం విసిరారు. రేవంత్ పాద‌యాత్ర‌ల‌కు మాంచి ఊపుమీద ఉండ‌టాన్ని ఉద్దేశించిన ఆయ‌న ఈ కామెంట్స్ చేయ‌టం పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. కాంగ్రెస్‌లో సీఎం అభ్య‌ర్థి ఎవ‌రూ లేర‌ని.. పార్టీలో గెలిచిన ప్ర‌తి ఎమ్మెల్యే కూడా సీఎం  అభ్య‌ర్థేనంటూ మ‌రో చుర‌క వేశారు. ఈ లెక్క‌న‌.. కోమ‌టిరెడ్డికి త‌త్వం బాగానే వంట‌బ‌ట్టిన‌ట్టుంది.. ఇదేదో.. ముందు నుంచి ఉంటే.. పీసీసీ చీఫ్ అయ్యావాడివేగా అన్నా.. అంటూ.. అభిమానులు.. తెగ ఫీల‌వుతున్నార‌ట‌. పోన్లే.. వ్రతం చెడినా.. ఫ‌లితం ద‌క్కితే అంతే చాలు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.