కోడెల కోర్టుకు వెళ్లాల్సిందే

సాధారణ ఎన్నికల వ్యయంపై దాఖలైన కేసులో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కోర్టుకు రావాల్సిందేనని కరీంనగర్‌ స్పెషల్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ ఆదేశించింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి అసెంబ్లీ నుంచి పోటీ చేసి అంబటి రాంబాబు పై గెలిచారు కోడెల. గతంలో నరసరావు పేట నుంచి ఆయన పోటీ చేసేవాళ్లు. సీటు మారడం వల్ల ఎక్కువ ఖర్చు అయిందని మీడియా ముఖంగా కోడెల చెప్పిన సంగతి తెలిసిందే. ఒక స్పీకర్ ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో తన ఖర్చు 11.50 కోట్లు అయిందని చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది.
విపక్ష నేతలంతా ఈ విషయం పై కోడెలను విమర్శించారు. వాస్తవంగా కోడెల కంటే ఎక్కువగానే చాలా మంది నేతలు ఖర్చు పెట్టారు. కానీ లెక్కల్లో ఎక్కడా చూపలేదు.

దీని పై ఏపీ నేతలు ఎవరూ స్పందించలేదు. కానీ కరీంనగర్‌కు చెందిన భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తి కోడెలపై కోర్టులో ప్రైవేట్‌ ఫిర్యాదు దాఖలు చేశారు. ఫలితంగా 2017 ఫిబ్రవరి 28న కోడెల పై కేసు నమోదైంది. 2016 జూన్‌ 19న ఆ ఇంటర్వ్యూ ప్రసారమైంది. ఇందుకు సంబంధించిన వీడియో, ఆడియో క్లిప్ లను కోడెల తీసుకున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఉందని ఫిర్యాదుదారు ఆరోపించారు. అంతే కాదు..స్పీకర్ ను అనర్హులుగా ప్రకటించాలని భాస్కర్‌రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన కోర్టు జూన్‌ 18న కోడెల హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఫలితంగా స్పీకర్ కోర్టుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.