పార్టీ ఏర్పాటు పై తగ్గేది లేదట

         తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు పై పొలిటికల్ జేఎసి చైర్మన్ కోదండరామ్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణలో రాజకీయ సంక్షోభం ఉంది. అందుకే పార్టీ ఏర్పాటు పై ఆలోచిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే ఆయన పార్టీ ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతున్నారు. ఇందుకు ప్రజా సంఘాలు, కవులు, కళాకారులు, మేధావులు, కేసీఆర్ కు వైరి వర్గం అంతా ఒక్కటవుతోంది. గతం కంటే కేసీఆర్ కు తెలంగాణలో హావా తగ్గుతోంది. అదే సమయంలో కులాల వారీగా ప్రజలను ఆకట్టుకునేందుకు కేసీఆర్ మంచి పథకాలను ప్రవేశ పెడుతున్నారు. ఆచరణలోకి తెస్తారా లేదా అనే సంగతి పక్కన పెడితే ప్రచార ఆర్భాటం బాగానే ఉంది. చేసేది తక్కువ. చెప్పేది ఎక్కువ అనే వాదన కేసీఆర్ సర్కార్ పై వస్తోంది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి కార్యక్రమాలు దేశానికే గర్వకారణంగా నిలుస్తోంది. మరికొన్ని పథకాలు పేరుకే గానీ అసలు ప్రవేశ పెట్టారా లేదా అనేదే తెలియదు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సంగతి సరిగా లేదు. రేషన్ సరుకులకు కోత వేశారు. 
          పార్టీ ఏర్పాటుపై తగు సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు కోదండరామ్. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతు ఆత్మహత్యలు రెట్టింపయ్యాయని, రైతుల సమస్యలపై ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపుతోందని మండిపడ్డారు కోదండరామ్. అసలు రాష్ట్రంలో ప్రజాసంక్షేమాన్ని కాపాడే పాలకులున్నారా.. లేక దోపిడీదొంగలున్నారా అనే అనుమానం కలుగుతోందన్నారు. గద్దర్, విమలక్కతో పాటు..టీఆర్ఎస్ పదవులు రాని..అసంతృప్తికి గురవుతున్న వారందరినీ కలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు కోదండరామ్. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా మారుతున్నారు. అందుకే సైన్స్ కాంగ్రెస్ ను వాయిదా వేశారంటున్నారు. 
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.