కోదండ‌రాం.. అంద‌రివాడా.. కొంద‌రివాడా!

కోదండం మాస్టారు.. మంచివారే కానీ.. ఆయ‌న‌ చుట్టూ ఉన్న‌కోట‌రీయే.. ఇదీ మాస్టారు కొత్త‌పార్టీపై పెల్లుబుకుతున్న వ్యతిరేకత‌. తాజాగా ఆయ‌న జేఏసీ ఛైర్మ‌న్‌ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఆదివారం తొలిసారి పార్టీ  తెలంగాణ జ‌న‌స‌మితి బ‌హిరంగ స‌భ జ‌రుగునుంది. దీనికోసం భారీ ఎత్తున జ‌న‌స‌మీక‌ర‌ణ కూడా షురూ చేశారు. సాధార‌ణ ప్రొఫెస‌ర్‌గా ఉన్న మాస్టారుకు.. ఇంత డ‌బ్బు ఎక్క‌డ నుంచి వ‌చ్చిందంటూ ఇంటిపార్టీ నేత చెరుకు సుధాక‌ర్ ప్ర‌శ్నిస్తున్నారు. వాస్త‌వానికి 2009లో తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మ స‌మయంలో తెలంగాణ పొలిటిక‌ల్ జాయింట్ క‌మిటీ(టీజాక్‌) ఏర్పాటైంది. అప్ప‌టి నుంచి ఆయ‌నే  ఛైర్మ‌న్‌గా ఉద్య‌మాన్ని న‌డిపించారు. కేసీఆర్ కూడా ఓ విధంగామార్గ‌ద‌ర్శ‌నం చేశారంటూ.. స్వ‌యంగా కేసీఆర్ ప‌లుమార్లు చెప్పుకొచ్చారు. ఆ త‌రువాత‌.. రాష్ట్రం ఏర్పాటు.. టీఆర్ ఎస్ అధికారంలోకి రావటం జ‌రిగాయి. టీజాక్‌ను ర‌ద్దు చేద్దామ‌ని కేసీఆర్‌సూచించినా మాస్టారు ల‌క్ష్య‌పెట్ట‌లేద‌ని స‌మాచారం. దీంతోనే కేసీఆర్ అహం దెబ్బ‌తిన్న‌ద‌ట‌. దీనికి ప్ర‌తీకారంగానే మాస్టారు నిర్వ‌హించే ఆందోళ‌న‌ల కార్య‌క్ర‌మాల‌కు అనుమ‌తినివ్వ‌ట్లేద‌ని కోద అన‌ండరాం అనుచ‌రులు ఆరోపిస్తున్నారు.  వీట‌న్నింటికీ స‌మాధానంచెప్పేందుకే ఆయ‌న పార్టీ వైపు అడుగులు వేశారు. కేసీఆర్ వ్య‌తిరేక వ‌ర్గం ఇప్పుడు కొత్త‌పార్టీ వైపు చూస్తోంది. ఈ జాబితాలో కొంద‌రు అధికార పార్టీకు చెందిన వారు కూడా ఉన్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఉమ్మ‌డి శ‌త్రువుపై మ‌చ్చ‌లేని నాయ‌కుడు  మొద‌లుపెట్టిన పోరుకు.. ప‌రోక్షంగా కాంగ్రెస్ మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు స‌మాచారం. ఇదే విష‌యాన్ని టీఆర్ ఎస్ నాయ‌కులు కూడా ప‌లుమార్లు ఉటంకించారు. మాస్టారును కాంగ్రెస్ ఏజెంట్‌గా చిత్రీక‌రించారు. 
మాస్టారుపార్టీ ఇప్ప‌టికిప్పుడు అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశాల్లేవు. అయితే కేసీఆర్ ఓట్ల‌కు మాత్రం గండికొట్ట‌గ‌ల‌ర‌ని కాంగ్రెస్ భావిస్తోంది. రాబోయే ఎన్నిక‌ల్లో  టీఆర్ ఎస్ ను దెబ్బ‌కొట్టేందుకు అస్త్రంగా మ‌ల‌చుకునే అవ‌కాశాలున్నాయ‌. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.