జగన్‌ను పొడిచిన కత్తిని వైసీపీ నేతలు ఏం చేశారు..?

ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఏపీ రాజకీయాల్లోనే కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా కలకలం రేపింది. విజయనగరం జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న జగన్.. శుక్రవారం నాంపల్లి కోర్టుకు హాజరు కావాల్సి ఉండడంతో.. గురువారం విశాఖ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. స్థానిక ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్ విమానం ఎక్కేందుకు లాంజ్‌లో కూర్చుని ఉండగా.. వెయిటర్‌లా వచ్చిన వ్యక్తి కత్తితో దాడి చేశాడు. జగన్‌తో సెల్ఫీ దిగుతానంటూ వచ్చి కోడి పందాలకు ఉపయోగించే కత్తితో దాడి చేశాడు. ఆ కత్తి జగన్ ఎడమచేతిపై దిగింది. దీంతో వెంటనే అలెర్ట్ అయిన జగన్.. అతడి బారి నుంచి తప్పించుకున్నాడు. దాడి చేసిన వ్యక్తిని ఎయిర్‌పోర్ట్‌లోని ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న వెయిటర్‌ శ్రీనివాస్‌గా గుర్తించారు. దాడి జరిగిన వెంటనే దుండగుడిని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. దాడి అనంతరం జగన్‌కు ప్రథమ చికిత్స చేసి హైదరాబాద్ విమానం ఎక్కించారు. ఈ ఘటనకు సంబంధించి బయటికొస్తున్న రోజుకో విషయం ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా మరో అంశం హాట్ టాపిక్‌గా మారింది.

జగన్‌పై దాడి జరిగిన తర్వాత నిందితుడు ఉపయోగించిన కత్తి మాయమైంది. దాదాపు గంటసేపు అది అక్కడ కనిపించలేదు. విషయమేమిటని ఆరా తీసిన కొందరికి సంచలన విషయం తెలిసింది. ఆ కత్తిని సంఘటనా స్థలంలో ఉన్న వైసీపీ నేతలు దానిని తీసుకుని వెళ్లారన్నదే ఆ వార్త సారాంశం. నిందితుడిని పట్టుకున్న గంట తర్వాత సీఐఎస్ఎఫ్ అధికారులు కత్తి కోసం మరోసారి అక్కడకు వచ్చారు. అప్పుడు కత్తి కనిపించకపోవడంతో వైసీపీ నేతలను అడిగారని, కొద్దిసేపటి తర్వాత వారిలోని కొందరు దానిని అధికారులకు అప్పగించారని తెలుస్తోంది. అప్పటి వరకు ఆ కత్తిని పార్టీ నేతలు మళ్ల విజయ్‌ప్రసాద్‌, మజ్జి శ్రీనివాసరావు (బొత్స మేనల్లుడు) కలిసి ఆ కత్తిని స్వాధీనం చేసుకొన్నట్లు తెలిసింది. దానికి ఏమైనా విషం పూశారేమోననే అనుమానంతో నగరంలోని ఒక డయాగ్నోస్టిక్‌ సెంటర్‌కు పంపించి పరీక్ష చేయించి, తిరిగి ఎయిర్‌పోర్టుకు తీసుకువచ్చినట్టు సమాచారం. ఇప్పుడీ వార్త సంచలనంగా మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.