ఏపీ క‌న్న క‌ల నిజ‌మైంది… ఇవీ ఫొటోలు!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ క‌ల నిజ‌మైంది. ప్ర‌పంచపు ఉత్త‌మ కార్ల కంపెనీలో ఒక‌టైన కియా మోటార్స్ త‌న ప్లాంట్ ప్రారంభించి అక్క‌డ త‌యారుచేసిన ఉత్ప‌త్తులు రూపం దాల్చి ఇపుడు క‌నువిందు చేస్తున్నాయి. చాలామంది నాలుగేళ్ల కాలం అభివృద్ధికి స‌రిపోదు అంటారు. కానీ నాలుగేళ్లలో ఒక అంత‌ర్జాతీయ కంపెనీని ఒప్పించి ఆంధ్ర‌కు తెచ్చి…అందులో ఉత్పత్తులు కూడా త‌యారుచేసి ప్ర‌పంచం క‌ళ్ల ముందు పెట్టాడు చంద్ర‌బాబు. సాధార‌ణంగా ఒక కంపెనీ ఇంత షార్ట్ టైంలో వంద‌ల కోట్ల ప్లాంటును పెట్ట‌డం అనేది సాధార‌ణంగా చాలాచాలా అరుదు. అలాంటి అద్భుతం ఏపీలో జ‌రిగింది. క‌ర‌వుకు చిహ్నం అని చెప్పుకునే అనంత‌పురం జిల్లాలో అంత‌ర్జాతీయ కంపెనీ వెలియ‌డం సాధార‌ణ విష‌యం కాదు. ఆ కంపెనీ నేరుగా 9500 మందికి ఉపాధి క‌ల్పిస్తే… అనుబంధ ఉపాధి మ‌రో 30 వేల మందికి దొర‌క‌డం ఏపీ ప్ర‌భుత్వం సాధించిన ఒక గొప్ప అచీవ్‌మెంట్‌.
ఈ కంపెనీ వ‌ల్ల అనంత‌పురం జిల్లాలో రియ‌ల్ ఎస్టేట్‌, వ్య‌వ‌సాయం, ప్ర‌చ్ఛ‌న ఉద్యోగ అవ‌కాశాలు, ర‌వాణా, ప‌ర్యాట‌క ఆతిథ్య రంగాలు బాగా అభివృద్ధి చెందాయి. జిల్లా మొత్తం అత్యుత్త‌మ మౌలిక స‌దుపాయాలతో అల‌రారుతోంది. ఈ నాలుగేళ్ల‌లోనే 30 శాతం జిల్లాలో విండ్ మిల్స్ ఏర్పాట‌య్యాయి. దీనివ‌ల్ల పాతిక వేల మందికి ఉపాధి దొరికింది.

ఇదిలా ఉంటే… ఈరోజు కియామోట‌ర్స్ డీల‌ర్ల కోసం ప్ర‌త్యేక ప‌రేడ్ నిర్వ‌హించింది. 6 ల‌క్ష‌ల నుంచి 26 ల‌క్ష‌ల వ‌ర‌కు విలువైన అనేక ర‌కాల మోడ‌ల్స్ డీల‌ర్ల‌కు ప్ర‌ద‌ర్శించారు. వాటి ఫీచ‌ర్ల‌ను వివ‌రించారు. ఆక‌ర్ష‌ణీయంగా రూపుదిద్దుకున్న ఆ కొత్త‌కార్ల‌ను చూసిన డీల‌ర్లు హ‌ర్షం వ్య‌క్తంచేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.