దానం… ఖైర‌తాబాద్ వ‌ద్దులే!

దానం నాగేంద‌ర్ ప‌రిస్థితి కుడితిలో ప‌డ్డ ఎలుక చందంగా మారిందట‌. కేసీఆర్ వేసిన ఎత్తుకు.. ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడ‌ట‌. ఎంతైనా ఆయ‌న కేసీఆర్‌.. వ్యూహ‌ర‌చన‌.. వైరిపై పైచేయి సాధించేందుకు వేసే ఎత్తుగ‌డ‌లు అర్ధం చేసుకోవ‌టం చాలా క‌ష్టం. అందుకే.. అన్ని పార్టీలు ఏకం కావాల్సి వ‌చ్చింది. అయినా.. ఏదోమూల‌న అంద‌రిలోనూ భ‌యం. ఎందుకంటే.. కేసీఆర్ త‌న మాట‌ల‌తో మంత్రం వేసి జ‌నాన్ని త‌న‌వైపు తిప్పుకోగ‌ల స‌మ‌ర్థ‌త ఉన్న నేత‌. అటువంటి నాయ‌కుడిని నోటికొచ్చిన‌ట్టు తిట్టి.. నానాయాగీ చేస్తే ఊరుకుంటాడు. అందుకే.. దానం కాంగ్రెస్‌లో స్థానం కోల్పోయాడ‌ని తెలిసి త‌న ప‌క్క‌కు గుంజుకున్నాడు. అది ఎన్నిక‌ల ముందు సీటు నీకే అంటూ తాయిలం వేసి మ‌రీ గుంజాడు. అంతే.. ఇదంతా నామీద ప్రేమ‌.. నా స‌మ‌ర్థ‌త‌పై న‌మ్మ‌కం అంటూ దానం నాగేంద‌ర్ ఊపుకుంటూ రాగానే.. ఒడ‌సిప‌ట్టి తాళం బిగించాడు. ఇంకేముంది.. మొద‌టిసీటు నాకేనంటూ జ‌బ్బ‌లు చ‌ర‌చుకున్న దానం పేరు 105 మందిలో లేక‌పోవ‌టంతో ఉల‌క్కిప‌డ్డాడ‌ట పాపం దానం. ఆయ‌న‌కు సీటిస్తే.. మేమేం చేయాలంటూ ఇప్ప‌టికే ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గంపై గంపెడాశ‌లు పెట్టుకున్న నేత‌లంతా కేసీఆర్ వ‌ద్ద మొర‌పెట్టుకున్నార‌ట‌. అందుకే… గోషామ‌హ‌ల్‌, జూబ్లీహిల్స్‌, అంబ‌ర్‌పేట అంటూ.. దానంకు మూడు అవ‌కాశాలు ఇచ్చార‌ట‌. ఎందుకంటే.. ఆ మూడింట ఎక్క‌డ గెలిచినా. దానం రికార్డు సాధించిన‌ట్టే.
ఎందుకంటే.. జూబ్లీహిల్స్ ఆల్రెడీ మాగంటి గోపీనాధ్ ఉన్నాడు. గోషామహ‌ల్ బీజేపీ కోట‌. అంబ‌ర్‌పేట కిష‌న్‌రెడ్డి ఇలాఖా.. కాదంటే.. ఉప్ప‌ల్‌.. ఇవ‌న్నీ దానం నెగ్గేందుకు క‌ష్ట‌మైన ప్రాంతాలు. కాద‌ని.. ఖైర‌తాబాద్ ఇస్తే.. టీఆర్ఎస్ కేడర్ ఝ‌ల‌క్ ఇస్తుంది. ఇక పీజేఆర్ కూతురు విజ‌యారెడ్డి వ‌ర్గం చుక్క‌లు చూపుతుంది. ఇటువంటి నేప‌థ్యంలో దానం ప్లేసు ఎక్క‌డ‌నేది తెలియ‌కుండా ఉంది. ఎక్క‌డ సీటు కేటాయించినా దానం గెల‌వ‌గ‌ల‌డంటూ ఆయ‌న అనుచ‌రులు చెబుతున్నారు. అయితే.. హ‌స్తంలో ఉన్నంత వ‌ర‌కూ ఓకే.. కానీ.. ఇప్పుడు కారుపై వ్య‌తిరేక‌త ఉన్న స‌మ‌యంలో అదీ.. సొంత‌గూటిలోనే వైరివ‌ర్గంతో నెగ్గి గెల‌వ‌గ‌ల‌డా అనేది దానంపై ఉన్న అనుమానం. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.