కృష్ణా టీడీపీలో కేశినేని కొర్రీ!

బెజ‌వాడ ఎంపీ కేశినేని నాని హ‌ద్దులు దాటుతున్నారా! కేశినేని ట్రావెల్స్‌ను మూసివేసిన‌ప్ప‌టి నుంచి పార్టీకు దూరంగా జ‌రుగుతున్నారా! వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపీ సీటుపై ఆయ‌న‌కు న‌మ్మ‌కం స‌న్న‌గిల్లుతుందా! దేవినేని, గ‌ద్దె వంటి వారితో వైరం పెరుగుతుందా. విజ‌య‌వాడ మేయ‌ర్ కోనేరు శ్రీధ‌ర్‌తో కేశినేని ఎందుకు గొడ‌వ‌ప‌డుతున్నారు. విజ‌య‌వాడ రాజ‌కీయాలు ఎంపీ కేశినేని చుట్టూ తిరుగుతున్నాయి. విజ‌య‌వాడ పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గంలో ఏడు అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గాలున్నాయి. నందిగామ‌, మైల‌వ‌రం, జ‌గ్గ‌య్య‌పేట‌, తిరువూరు వీటిలో చాలా క్లిష్ట‌మైన‌వి. ప‌శ్చిమంలో  ఓట్లు కొల్ల‌గొడితేనే.. అసెంబ్లీలో నెగ్గినా , పార్ల‌మెంటు సీటు వ‌రించినా. కానీ.. అసెంబ్లీ అభ్య‌ర్థుల విష‌యంలో ఒక‌లా.. ఎంపీ విష‌యంలో మ‌రోలా ఉండ‌టం.. ఈ నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌త్యేక‌త‌.  క్రాస్ ఓటింగ్ కొన్నిసార్లు అభ్య‌ర్థుల‌కు చుక్క‌లు చూపుతుంది కూడా. ఇంత‌టి కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గాలున్న చోట‌. నేత‌లు ఆచితూచి అడుగులు వేస్తారు. నోరుకూడా చాలా అదుపులో ఉంచుకుంటారు. అటువంటిది ఎంపీ కేశినేని నాని.. ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌న‌కంటూ కోట‌రీను ఏర్పాటుచేసుకున్నారు. త‌నంటే గిట్ట‌ని ఎమ్మెల్యేల‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేయ‌మంటూ ప్రోత్స‌హిస్తార‌నే విమ‌ర్శ‌లు చ‌విచూస్తున్నారు. మైల‌వ‌రం, తిరువూరు, నందిగామ నియోజ‌క‌వ‌ర్గాల్లో టాటా సౌజ‌న్యంతో ప‌లు కార్య్రక్ర‌మాలు చేప‌ట్టారు.
కానీ.. ఏ కొండూరు, మైల‌వ‌రం, నందిగామ‌ల్లో కొన్నిచోట్ల స్థానిక నేత‌ల‌తో కాస్త క‌ట‌వుగా వ్య‌వహ‌రించ‌ట‌మే గాకుండా.. తాను చెప్పిన మెజార్టీ తీసుకురాక‌పోతే.. నామినేటెడ్ ప‌ద‌వులు ఉండ‌వంటూ భ‌య‌పెడుతున్నార‌ట‌. ఏ కొండూరులో ఎంపీపీను ఉద్దేశించి 2019 ఎన్నిక‌ల్లో 10వేల మెజార్టీ తీసుకురావాలంటూ ఆదేశించారంట‌. పైగా అది సాధించ‌క‌పోతే.. ప‌ద‌వులు ఊడిపోతాయంటూ అల్టిమేటం జారీచేశార‌ట‌. దీంతో లోక‌ల్ లీడ‌ర్లంతా.. ఇదేం టార్గెట్‌రా బాబూ అంటూ ఆవేద‌న వెలిబుచ్చుతున్నారు. ఇప్ప‌టికే ర‌వాణాశాఖ అధికారుల‌తో గొడ‌వ‌తో చాలా వ‌ర‌కూ విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. ప్ర‌యివేటు ట్రావెల్స్ విష‌యంలో ఎంపీ వ్య‌వ‌హారం అధినేత చంద్ర‌బాబునాయుడుకు చికాకు తెప్పించింది. పైగా పార్ల‌మెంట్‌లో స‌రిగా స్పందించ‌ట్లేదంటూ జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ నుంచి విమ‌ర్శ‌లు చ‌విచూశారు. అటు వ్యాపారం.. ఇటు రాజ‌కీయం రెండింటి మ‌ధ్య స‌మ‌న్వయం లేక‌పోవ‌టం వ‌ల్ల‌నే ఎంపీ బాధ‌ప‌డుతున్నారంటున్నారు. పైగా రేప‌టి ఎన్నిక‌ల్లో త‌న‌కు సీటు కేటాయింపుపై బాబు స్ప‌ష్ట‌త ఇవ్వ‌క‌పోవ‌టం వ‌ల్ల ఎమోష‌న్ అవుతున్నార‌నే ప్రచారం జ‌రుగ‌తుంది. పైగా.. కృష్ణాలో టీడీపీ ఎమ్మెల్యేలు వ్య‌తిరేక‌మైన‌ట్లు తెలుస్తోంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.