కేసీఆర్ పొగిడిన కోమటిరెడ్డి 

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో కొత్తదనం ఏమి లేదనుకుంటే తప్పులో కాలేసినట్లే. గతంలో ఎప్పుడు ఇలా కేసీఆర్ ఆయనకు శుభాకాంక్షలు చెప్పలేదు. ఈ సారి శుభాకాంక్షలు తెలియజేస్తూ కోమటిరెడ్డికి ఏకంగా సీఎం లేఖ పంపారు. కానీ ఆలేఖలో కోమటిరెడ్డిని ఎమ్మెల్యేగా ప్రస్తావించడం గమనార్హం. అసెంబ్లీ నుంచి ఆయన్ను సస్పెండ్ చేసినా… ఇంకా ఎమ్మెల్యేగానే ఆయన్ను సంబోధించారు కేసీఆర్. 
‘మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజలకు సేవలందించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను’ అని ఆ లేఖలో తెలిపారు. ఇందుకు కోమటిరెడ్డి స్పందించారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలిపినందుకు కోమటిరెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కోర్టుకువెళ్లారు ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, కోమటిరెడ్డిలు. ఈ అంశంలో కోర్టు మొట్టికాయలు వేసింది. అయినా కోర్టు ఆదేశాలను అమలు చేయలేదు కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్‌ మాత్రం నన్ను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ శుభాకాంక్షలు తెలిపారని కోమటిరెడ్డి దాదాపు పండుగ చేసుకుంటున్నారు. తనను కలిసిన అనుచరులకు కేసీఆర్ పంపిన లేఖను చూపిస్తున్నారు కోమటిరెడ్డి. 
మీడియాలో ఈ విషయం ఫోకస్ కావడంతో కోమటిరెడ్డిని కలిసిన నేతలు కేసీఆర్ లేఖ ఏది అంటూ అడిగి మరీ చూస్తున్నారు. కేసీఆర్ మీద ఒంటి కాలిపై లేస్తున్నారు కోమటిరెడ్డి. గతంలో రేవంత్ రెడ్డికి ఇలానే కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ప్రజలను ఆకట్టుకునే పనిచేశాడు. ఇప్పుడు కోమటిరెడ్డి విషయంలోను అదేపని చేశాడు కేసీఆర్. ఇందుకు స్పందించిన కోమటిరెడ్డి మీకు ఏమాత్రం కోర్టు మీద గౌరవం ఉన్నా ఎమ్మెల్యేగా నాకు దక్కాల్సిన అన్నీ వసతులు కల్పించండి. నన్ను వెలివేసి.. ఎమ్మెల్యేగా గుర్తించి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్‌ గొప్పవ్యక్తి. ఓవైపు గన్‌మెన్లను తొలగించి.. మరోవైపు ఆశీర్వదిస్తున్నారు అని అన్నారు. ఇంతకు కోమటిరెడ్డి తిట్టినట్లునా.. పొగిడినట్లునా అర్థం కాలేదు మిగతా వారికి. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.