మోడీ జపం చేస్తున్న కేసీఆర్

తెలంగాణకు రూపాయి ఇవ్వకుండా నాశనం చేస్తున్నారని సి.ఎం కేసీఆర్ అన్న మాట. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణకు వచ్చి వెళ్లిన తెల్లారి అన్న మాట. ఇది గతం. ఆ తర్వాత కూడ కేంద్రంపై నిప్పులు చెరిగారు కేసీఆర్. తెలంగాణ నుంచి సొమ్ములు తీసుకుంటూ.. తెలంగాణకు సాయం చేయడానికి చేతులు రావడం లేదని మోదీపై తన స్టైల్లో తిట్ల వర్షం కూడా కురిపించారు. ప్రధాని మోడీని వాడు అనే పదంతో సంబోధించారు. ఫలితంగా కమలం శ్రేణులు అభ్యంతరం చెప్పాయి. కేటీఆర్, కవితలు రంగంలోకి దిగి పొరపాటున అలా అన్నారని చెప్పుకోవాల్సి వచ్చింది. కేసీఆర్ ఘాటు పదాలు చూసి ఇంకేముంది కేంద్రంతో కయ్యం పెట్టుకుంటున్నారనుకున్నారు. కానీ అది నిజం కాదని అర్థమవుతోంది. బీజేపీ, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా ఫ్రంట్ పెడుతున్నట్లు చెబుతున్నా.. దాని భవిష్యత్ ఎలా ఉంటుందో జాతీయ నేతలకే కాదు.. కేసీఆర్ కు తెలియదంటారు. 
అలాంటి కేసీఆర్ ఇప్పుడు ఏపీలో పెట్టిన ఆర్థిక మంత్రుల సమావేశానికి తమ ప్రతినిధులను పంపలేదు. 15వ ఆర్థిక సంఘం విధివిధానాలను తీవ్రంగా వ్యతిరేకించేందుకు అమరావతిలో ఏపీ ప్రభుత్వం సమావేశం నిర్వహించింది. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఈ భేటీకి హాజరయ్యారు. బీజేపీ అధికారంలో లేని అన్ని రాష్ట్రాలకూ ఆహ్వానం పంపారు. తెలంగాణ ఈ ఆహ్వానాన్ని కాదని చెప్పింది. కేంద్రంపై మేము పోరాడుతున్నాం. తెలంగాణ కూడా.. ఆ నిబంధనల వల్ల నష్టపోతోంది. అయినా సరే మా పోరాటం మాదే. మీతో కలిసి పని చేసేది లేదని చెప్పారు తెలంగాణ నేతలు. కేంద్రానికి వ్యతిరేకంగా జరిగే సభలు, సమావేశాలకు రాలేమని మరోరకంగా చెప్పేసింది కేసీఆర్ టీమ్.
మోదీపై ఈగ వాలనీయడం లేదు కేసీఆర్. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో బెంగాల్, బెంగళూరు, చైన్నైకు వెళ్లి వచ్చారాయన. మరోవైపు యూపీ మాజీ సిఎం అఖిలేష్ యాదవ్ ను పిలిపించారు. అయినా సరే బీజేపీకి వ్యతిరేకంగా పావులు కదిపేందుకు ఆయన సిద్దపడటం లేదు. అందుకే కేసీఆర్ ను నమ్మాలా వద్దా అనే సందేహంలో పడ్డాయి ప్రాంతీయ పార్టీలు. ఇప్పుడు ఆర్థిక మంత్రుల సమావేశానికి డుమ్మా కొట్టిన కేసీఆర్.. బీజేపీకి సాయపడుతున్నారని తెలుస్తోంది. ఉచిత విద్యుత్ పథకానికి అడ్డంకులు కల్పిస్తున్నా.. నిధులు ఇవ్వకపోయినా ఏం అనకూడదట. ఫలితంగా కేసీఆర్… మోదీని మోసేస్తున్నారని అర్థమవుతోంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.