టిడిపి నేత కోసమే ఆ స్థానాన్ని పెండింగ్ లో పెట్టిన కేసిఆర్

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నందున రాష్ట్రంలోని పార్టీలన్నీ స్పీడ్ పెంచేశాయి. దీనితో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అభ్యర్థుల ప్రకటన.. ప్రచారం వంటి విషయాల్లో తెలంగాణ రాష్ట్ర సమితే అన్ని పార్టీలకంటే ముందుందని చెప్పాలి. ప్రతిపక్షాలు ఇంకా సీట్లపై సిగపట్లు పడుతున్న వేళ.. అధికార పార్టీ వేగంగా దూసుకుపోతోంది. అసెంబ్లీని రద్దు చేసిన రోజు 105 మంది అభ్యర్థులను ప్రకటించడంతో ఆయా నేతలంతా ప్రచారాన్ని ముమ్మరం చేసేశారు. కొద్దిరోజుల క్రితం కేసీఆర్.. మరో ఇద్దరు అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. తాజాగా టీఆర్‌ఎస్ పార్టీ మరో 10 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రటించింది. మేడ్చల్‌-చామకూర మల్లారెడ్డి, గోషామహల్‌- ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌,  చార్మినార్‌-మహ్మద్‌ సలావుద్దీన్‌ లోడీ, వరంగల్‌ తూర్పు- నన్నపనేని నరేందర్‌, హుజూర్‌నగర్‌-శానంపూడి సైదిరెడ్డి, వికారాబాద్‌- మెతుకు ఆనంద్, అంబర్‌పేట- కాలేరు వెంకటేశ్‌, మల్కాజ్‌గిరి- మైనంపల్లి హన్మంతరావు, చొప్పదండి- సొంకె రవిశంకర్‌, ఖైరతాబాద్‌-దానం నాగేందర్‌‌లను ఖరారు చేసింది. ఈ మేరకు తాజాగా జాబితాను విడుదల చేసింది.

అయితే మరో రెండు నియోజకవర్గాలు కోదాడ, ముషీరాబాద్ అభ్యర్థులను పెండింగ్‌లో పెట్టింది. ఒకట్రెండు రోజుల్లో ఈ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ రెండు స్థానాలను పెండింగ్ లో పెట్టడానికి పలు కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. ముషీరాబాద్‌ టికెట్‌ తన అల్లుడు శ్రీనివాస్ రెడ్డికి ఇవ్వాలని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి గట్టిగా కోరుతున్నారు. ఆయనను ఎలాగైనా బుజ్జగించి అక్కడ పార్టీ టికెట్‌ ముఠా గోపాల్‌కు ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తోంది. ఈ కారణంగానే ముషీరాబాద్ ను పెండింగ్లో పెట్టగా.. కోదాడను మాత్రం ఆపడానికి టిడిపి నేత కారణమని తెలుస్తోంది. కోదాడలో తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి శశిధర్‌రెడ్డి- వేనేపల్లి చందర్‌రావు మధ్య టికెట్ పోటీ నెలకొంది. అయితే బలమైన అనుచరగణం ఉన్న టీడీపీ నేత బొల్లం మల్లయ్య యాదవ్ వైపు టిఆర్ఎస్ అధిష్టానం చూస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయనతో టిఆర్ఎస్ ముఖ్య నేతలు మంతనాలు జరిపారని, రెండు మూడు రోజుల్లో మల్లయ్య గులాబి కండువా కప్పుకొనున్నారని ప్రచారం జరుగుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.