తుస్సుమన్న కేసీఆర్ ఫ్రంట్

తెలంగాణ సిఎం కేసీఆర్ ను దేశంలోని ప్రధాన పార్టీలు నమ్మడం లేదు. అందుకే ఆయన దూకుడు తగ్గించారు. ప్రత్యేక ప్రంట్ ఏర్పాటు చేస్తానని…బీజేపీ, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వెళతానని చాలా మాటలే చెప్పారు కేసీఆర్. ఇప్పుడు ఆయన్ను పట్టించుకునే పార్టీలే లేవు. పైగా ఆయన కలిసి వచ్చిన పార్టీలు సైతం కాంగ్రెస్ కు జతకలిశాయి. ఇప్పుడు ఏం చేయాలో కేసీఆర్ కు అర్థం కావడం లేదు. మమతా బెనర్జీ, స్టాలిన్, కుమారస్వామి వంటి వారు కాంగ్రెస్ కు అనుకూలంగా మారారు. అందుకే పరువు పోగొట్టుకోవడం ఇష్టం లేక ముందుగా కుమారస్వామిని కలిసి వచ్చారు సిఎం. ఆ కూటమి నేతలను కలవడం ఇష్టం లేకనే కేసీఆర్ ముందుగా వెళ్లి వచ్చారంటున్నారు. దేశవ్యాప్తంగా చక్రం తిప్పుతారని భావించిన కేసీఆర్ ఇప్పుడు ఇంటికే పరిమితమయ్యారు. గతంలో ఉన్న దూకుడులేదు. 
బీజేపీకి ఎజెంట్ గా కేసీఆర్ వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అందుకే కేసీఆర్ ను మిగతా పార్టీలు పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. పైగా అబద్దాలు చెబుతున్నారు కేసీఆర్. వారు పిలవక పోయినా పిలిచినట్లు ప్రకటించుకున్నారు. తీరా కేసీఆర్ మాటలు నిజం కాదని..పశ్చిమ బెంగాల్, ఒడిస్సా ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటించాయి. తెలంగాణలో అయితే ఏదన్నా చెల్లుబాటు అవుతోంది. కానీ ఇతర రాష్ట్రాల్లో కేసీఆర్ ను లెక్క చేసేవారే లేరంటున్నారు. ఫలితంగా కేసీఆర్ కు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడంలేదంటున్నారు. 
దేశంలో కొత్తగా జరుగుతున్న మూడో ప్రంట్ ప్రయత్నాల వెనుక బిజెపి ఉందని బలంగా నమ్ముతున్నాయని యుపిఏ పార్టీలు. అందుకే కేసీఆర్ ను దూరంగా పెడుతున్నారనే వాదన ఉంది. ఇదే విషయం పై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిపాదించిన ఫెడరల్‌ ఫ్రంట్‌ వెనక బీజేపీ ఉందన్న ప్రచారంలో నిజం లేదన్నారు. ఆ సంగతి కేసీఆర్ చెప్పుకోవాలి. కానీ బీజేపీ చెబుతుందంటే ఏదో ఉందనే చెప్పాలి. దేశంలో మూడో, నాలుగో కూటమికీ బీజేపీ అధికారికంగానూ, అనధికారికంగానూ ఏ విధంగా కూడా సలహాదారు కాదని కమలం పార్టీ చెబుతోంది. 
1990ల్లో దేవేగౌడ, ఐకే గుజ్రాల్‌ నేతృత్వంలో కేంద్రంలో థర్డ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 2019లో అలాంటివి పునరావృతం అయ్యే అవకాశాలు లేకపోలేదు. విపక్ష పార్టీలతో అతుకుల బొంతగా ఏర్పడే కూటములు ఎక్కువ రోజులు నిలవబోవనే సంగతి తెలిసిందే. ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమితో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 2019లో బీజేపీ కేంద్రంలో అధికారాన్ని నిలుపుకుంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.