పార్టీ అభ్యర్థుల పనితీరుపై కేసీఆర్‌ సర్వే?

టీఆర్‌ఎస్‌ పార్టీలో టికెట్‌ ఖరారయిందని సంబరాల్లో ఉన్న ఆపార్టీ అభ్యర్థులకు అధినేత కేసీఆర్‌ ఝలక్‌ ఇవ్వనున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టికెట్‌ ఖరారయి ఓటమి బాటలో పయనిస్తున్న అభ్యర్థులకు  కేసీఆర్‌ చెక్‌ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గాల్లో ప్రజల ఆమోదం పొందని వారికి టికెట్‌ ఇస్తే మెజార్టీ అందుకోలేకపోతారన్న అనుమానంతో అభ్యర్థుల గురించి ఆయన ఎప్పటికప్పుడు డు సర్వేలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది.  ప్రజల్లో వస్తున్న సానుకూల వాతావరణం గురించి ఎప్పటికపుడు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఓ బృందాన్ని  కేసీఆర్‌ పురమాయించినట్లు సమాచారం. చివరి క్షణం వరకు గెలిచే అవకాశాలు లేకపోతే, గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేసీఆర్‌ చేయిస్తున్న సర్వేలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆసిఫాబాద్‌, ఖానాపూర్‌, మంచిర్యాల, చెన్నూరు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో హుజూర్‌నగర్‌, కరీంనగర్‌ జిల్లాలో వేములవాడ, కోరుట్ల, పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్‌ జిల్లాలో ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్‌ నియోజకవర్గాల్లో కేసీఆర్‌ ప్రత్యేకంగా సర్వే చేయిసున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొదటి విడత సర్వేలో ఈ నియోజకవర్గాలతో పాటు మరికొన్ని నియోజకవర్గాలు ఉండగా,  ఇప్పటికే తాజా మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ చార్జ్‌ ల పనితీరుపై గులాబీదళపతి ఎప్పటికపుడు సర్వేలు చేయిస్తున్నారంటున్నారు. సర్వేలో గెలిచే అభ్యర్థులు, గెలుపు అంచుల్లో ఉన్న వారితోపాటు, ఓటమి దిశగా  పయనించే వారి వివరాలను ప్రత్యేకంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
ఓటమి ఖాయమనుకున్న వారిని కేసీఆర్‌ ఎప్పటికపుడు అప్రమత్తం చేస్తూ వచ్చారు. అయినప్పటికీ ప్రజలను తమకు అనుకూలంగా మార్చుకోలేకపోయిన పార్టీ అభ్యర్థులకు,  కేసీఆర్‌ చెక్‌ పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. పొలిటికల్‌ ఇంటెలిజెన్స్‌, పోలీస్‌ ఇంటెలిజెన్స్‌ తో పాటు ప్రత్యేకంగా ఓ సర్వే బృందాన్ని కూడా రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. సర్వేల ఆధారంగా అభ్యర్థులకు బీ ఫాంలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొదటి విడత ప్రకటించిన అభ్యర్థుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని  కేసీఆర్‌ భావిస్తున్నారని పార్టీ వర్గాలంటున్నాయి. కొత్త ఏర్పడిన రాషాట్రల్లో మొదటిసారి అధికారంలోకి వచ్చిన పార్టీలు, ఇప్పటివరకూ రెండోసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేదని రాజకీయ పరిశీలకులంటున్నారు. ఈ రికార్డును బద్దలు కొట్టాలన్నలక్ష్యంతోనే, రకరకాలుగా కేసీఆర్‌ సర్వేలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు కేసీఆర్‌ చేయించిన సర్వేలు బయటకు వచ్చినప్పటికీ, అభ్యర్థుల ప్రకటన తర్వాత గుట్టుచప్పుడు కాకుండా సర్వేలు చేయిస్తున్నట్లు సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థులు సీరియస్‌ ఉండకపోతే, ప్రతిపక్ష పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు ఉన్నాయన్న ఉద్దేశ్యంతోనే కేసీఆర్‌ సర్వే చేయిస్తున్నారని ఆపార్టీ నేతలు చెబుతున్నప్పటికీ, అభ్యర్థులు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న భీపాం దక్కే అవకాశాలు మాత్రం కనిపించడం లేదన్న వానదలు పార్టీ వర్గాల్లో వెల్లడవుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.