రాజ్యసభ సీట్ల గెలుపు కసరత్తు

మూడు రాజ్యసభ సీట్లు గెలిచేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది టీఆర్ఎస్. ఒకే అభ్యర్థికి ఎక్కువ మంది ఓట్లు వేయకుండా.. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. టీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్యను అభ్యర్థుల మధ్య సమానంగా పంచుతోంది. కాంగ్రెస్‌ నుంచి చేరిన ఎమ్మెల్యేలందరికీ పక్కాగా శిక్షణనిస్తోంది. ఒక్కో రాజ్యసభ అభ్యర్థికి సంబంధించిన బాధ్యతలను ఇద్దరు మంత్రులకు అప్పగించడం మాములు విషయం కాదు. 
2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన వారు 65 మంది ఎమ్మెల్యేలు. వారితోపాటు… టీడీపీ (12), వైఎస్సార్‌సీపీ (3), బీఎస్పీ (2) ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరారు. ఫలితంగా టీఆర్‌ఎస్‌కు అధికారికంగా 82 మంది ఓటర్లు ఉన్నారు. వారే కాదు… కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఏడుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఒక సీపీఐ ఎమ్మెల్యే ఉన్నారు. వారిని కలుపుకుంటే 90 మందికి చేరతారు నేతలు. టీఆర్‌ఎస్‌కు మద్దతిస్తామని మజ్లిస్‌ ప్రకటించింది. శాసనసభలో 119 మంది ఎమ్మెల్యేలకుగాను.. కోమటిరెడ్డి, సంపత్‌ల బహిష్కరణకు గురయ్యారు. ఫలితంగా ఆ సంఖ్య 117కు తగ్గుతోంది. ఈ లెక్కన గెలిచే అభ్యర్థికి 29 ఓట్లు వస్తే సరిపోతుంది. పోలింగ్‌కు సభ్యులు గైర్హాజరైతే గెలవడానికి 26 లేదా 27 ఓట్లు సరిపోతాయనే అంచనాలు ఉన్నాయి. 
ఒక్కో అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యతను ఇద్దరు చొప్పున మంత్రులకు కేసీఆర్‌ అప్పగించారు. జోగినిపల్లి సంతోష్‌ గెలుపు బాధ్యతను మంత్రులు కేటీఆర్, ఈటలకు.. బండా ప్రకాశ్‌ బాధ్యతలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావులకు.. బడుగుల లింగయ్యయాదవ్‌ బాధ్యతను మంత్రులు టి.హరీశ్‌రావు, జి.జగదీశ్‌రెడ్డిలకు అప్పగించారు. ముగ్గురు అభ్యర్థులను గెలిపించే బాధ్యత వారిదే. 
ఒకే అభ్యర్థికి ఎక్కువ ఓట్లు రావడం, మరో అభ్యర్థికి తక్కువ ఓట్లు రావడం వంటి సమస్యలు తలెత్తకుండా ఎవరెవరు ఎటువైపు ఓట్లేయాలనేది సూచించనున్నారు. టీఆర్‌ఎస్‌కు చెందిన 82 ఓట్లలో 30 మందిని సంతోష్‌కుమార్‌కు, మరో 30 మందిని బండా ప్రకాశ్‌కు కేటాయించారు. మిగతా 22 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఏడుగురు మజ్లిస్‌ ఎమ్మెల్యేలు కలిపి 29 మందిని లింగయ్యయాదవ్‌కు కేటాయించడం విశేషం. ఇక కాంగ్రెస్‌ నుంచి చేరిన ఏడుగురు, సీపీఐకి చెందిన ఒక ఎమ్మెల్యే ఓట్లను అవసరాన్ని బట్టి ఉపయోగించుకోనున్నారు. 
మరోవైపు కాంగ్రెస్ వెనక్కు తగ్గడం లేదు. వీలున్నంతగా టీఆర్ఎస్ వర్గం ఓట్లు చీలతాయనే ఆలోచన చేస్తోంది. అదే సమయంలో సంపత్, కోమటిరెడ్డిలకు ఓటు హక్కు కల్పించాలని కోర్టును కోరనుంది కాంగ్రెస్. ఇందుకు హైకోర్టు ఎలా స్పందిస్తుందనే ఉత్కంఠ నెలకుంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.