కేసీఆర్ సీరియస్ వార్నింగ్

తెలంగాణలో అధికారంలో టీఆర్ఎస్.. వచ్చే ఎన్నికల్లో మరోసారి సత్తాచాటాలని భావిస్తోంది. అయితే, గత ఎన్నికలతో పోలీస్తే ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారిన దృష్ట్యా ఈ ఎన్నికలను ఆ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత ఎన్నికల్లో జరిగిన కొన్ని పొరపాట్లను సరిదిద్ధుకోవడంతో పాటు, వచ్చే ఎన్నికలకు పక్కా ప్రణాళికతో సిద్ధం అవ్వాలని ఆ పార్టీ డిసైడ్ అయిపోయింది. అందుకోసం ఎన్నో వ్యూహాలు రూపొందిస్తోంది ఆ పార్టీ అధినాయకత్వం. కొద్ది నెలల కింద వరకు అధికారపక్షం 2019లో విజయంపై చాలా ధీమాగా ఉండేది. కానీ, ఇటీవల కాంగ్రెస్ పార్టీ చురుకుగా ఉండడం.. ప్రొఫెసర్ కోదండరామ్ పార్టీ స్థాపించడం.. తెలుగుదేశం పార్టీ కూడా కొంత ప్రభావం చూపగలడం వంటి అంశాల వల్ల ఆ పార్టీలో కలవరం మొదలైందనేది వాస్తవం.

అందుకోసమే వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారట గులాబీ బాస్. దీని కోసం తనకెంతో ఇష్టమైన సర్వే మార్గాన్నే ఎంచుకని, దాని ఆధారంగానే టికెట్లు ఇవ్వాలని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం. గతంలో పలుమార్లు కేసీఆర్ సర్వేలు చేయించిన విషయం తెలిసిందే. అప్పట్లో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరు గురించి కేసీఆర్ సర్వే చేయించారు. ఆ సర్వేలో తమ పార్టీ ప్రజా ప్రతినిధులకు అనుకూలంగానే ఫలితాలు వచ్చాయి. అయితే, ఇటీవల చేయించిన మరో సర్వేలో మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న దాదాపు 40పై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని వార్తలు వచ్చాయి. అంటే మిగతావారి పనితీరు పట్లు వారు సంతోషంగా ఉన్నట్లేనని అర్థమైంది.

ఎన్నికలు సమీపిస్తున్నందున అభ్యర్ధుల ఎంపిక విషయంలో కసరత్తు ప్రారంభించిన కేసీఆర్.. ఈ 40 మంది ఎమ్మెల్యేల పనితీరుపై తాజాగా మరోసారి సర్వే చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ సర్వే గురించి ఆయన సదరు ఎమ్మెల్యేలకు ముందుగానే సమాచారం కూడా ఇచ్చారట. ఈ సారి కూడా గతంలో వచ్చిన ఫలితాలే వస్తే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించిన సీఎం.. ఈ సర్వే ఫలితాలను బట్టే వచ్చే ఎన్నికల్లో వారికి టికెట్లు ఇస్తామని తేల్చి చెప్పేశారని టాక్ వినిపిస్తోంది. ఈ సర్వే ఫలితాలు ఎప్పుడెప్పుడు వస్తాయా.. తమ బాస్ ఏం బాంబ్ పేల్చుతారా అని ఆ ఎమ్మెల్యేలు బిక్కు బిక్కు మంటూ కాలం వెల్లదీస్తున్నారట. ఈ వ్యవహారానికి సంబంధించిన సమావేశం గత వారం హైదరాబాద్‌లో జరిగిందని సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.