కేసీఆర్‌నే.. దిక్క‌రింతురా! 

దిక్కార‌మున్ చేతురా.. కేసీఆర్ ఆర్డ‌ర్‌నే బేఖాత‌ర్ చేస్తారా. అమ్మా. ఎంత ధైర్యం.. ఎన్ని గుండెలు. కేసీఆర్ దొర ఇగో హ‌ర్ట్ అయింది. ఇక ఊరుకునే ప్ర‌స‌క్తేలేదు. దంచుడే.. దంచుడు కాచుకోండి. ఇదేంటీ దంచేది ఆంధ్రోళ్ల‌ని క‌దా! కాదు.. ఈ సారి దంచేది తెలంగాణా వాళ్ల‌నేన‌ట‌. అదే.. ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను.. బొంద‌పెట్టేంత వ‌ర‌కూ ఊరుకునే ప‌రిస్థితే లేదట‌. ఇన్నేళ్ల‌లో ఎవ‌రూ.. ఏ ముఖ్య‌మంత్రి చేయ‌ని ప‌ని మా కేసీఆర్ సారు చేత్తుంటే.. ఆయ‌న మీద వ్య‌తిరేక‌త చూపుతారా.. చూస్తాం.. అంటూ పార్టీ శ్రేణులు కూడా తెగ ఊగిపోతున్నాయ‌ట‌. ఇంత‌కీ అస‌ల విష‌యం ఏమిటంటే.. కేసీఆర్ గారికి ఈ మ‌ధ్య ఎక్క‌డా క‌ల‌సిరావ‌ట్లేదు. 2019 ఎన్నిక‌లు న‌ల్లేరు మీద న‌డ‌క‌.. 100 సీట్లు కారు సీటు కింద భ‌ద్రంగా ఉన్నాయంటూ ఇప్ప‌టి దాకా డాంభికాలు పోయిన నేతలు.. మేక‌పోతు గాంభీర్యాన్ని ప్ర‌ద‌ర్శించాల్సి వ‌స్తోంది. ఇదంతా.. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో కొనితెచ్చుకున్న ఇబ్బందులేన‌ట‌. అదెలా అంటారా.. నాలుగేళ్ల పాటు కేంద్రంతో దోస్తీగా మెలిగిన చివ‌ర్లో.. మోదీ కాస్కో అంటూ స‌వాల్ విసిరాడు కేసీఆర్‌. ఫెడ‌రల్ ఫ్రంట్‌తో మూడో కూట‌మికి నాంది ప‌లికాడు.. అభిన‌వ తెలంగాణా గాంధీ. ప్ర‌క‌టించిన మొద‌టిరోజే ల‌ల్లూ.. మ‌మ‌తా.. అఖిలేష్‌యాద‌వ్‌.. ఇలా.. విప‌క్ష‌.. అధికార ప‌క్ష నేత‌లు ఫోన్ చేసి.. కేసీఆర్ నువ్వు సూప‌ర్‌.. నీ వెనుకే మేమంతా అంటూ మ‌ద్ద‌తు ప‌లికారంటూ.. మీడియాకు లీకులిచ్చారు. తీరా.. కేసీఆర్ సార్‌.. భార‌త ప‌ర్య‌ట‌న‌కు సిద్ధ‌ప‌డి.. ఊరూవాడా తిరుగుతుంటే.. ఫోన్‌లో.. హాయ్ అన్న నేత‌లు కూడా.. ఇంటిగుమ్మం వ‌ద్ద‌కు వ‌చ్చిన గులాబీబాస్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చి.. ఇక బాయ్‌బాయ్ అంటున్నార‌ట‌. ప‌శ్చిమ‌బెంగాల్‌, ఒడిషా, క‌ర్ణాట‌క‌లో ఇదే అనుభ‌వం ఎదుర‌వ‌టంతో.. ఆయ‌న‌కు కేంద్రంలో చ‌క్రం తిప్పాల‌నే ఆశ‌ల‌కు గండిప‌డుతున్న‌ట్లుగా తోచింద‌ట‌. అదేమిటీ.. నిన్న‌టి దాకా నువ్వే మా పెద్ద దిక్క‌య్యా.. అంటే.. ఈ సారి పీఎం ప‌ద‌వో.. కుద‌ర‌క‌పోతే.. కేంద్రంలో హోంశాఖో వస్తుంద‌నుకుంటే.. ఉన్న సీఎం సీటుకే ఎస‌రు వ‌చ్చేట్టుందే అనేంత బెంగ ప‌ట్టుకుంద‌ట‌. గొర్రెలు, మేక‌లు, బ‌ర్రెలు కొనిచ్చినా జ‌నం న‌మ్మ‌ట్లేదు. కాక‌తీయ‌, మిష‌న్ భ‌గీర‌థ‌తో చెరువులు త‌వ్వించినా.. మార‌ట్లేదు. రైతుల‌కు పెట్టుబ‌డి ఇస్తామ‌న్నా పెద‌వి విరుస్తున్నారు. బంగారు తెలంగాణ‌కు అడ్డుక‌ట్ట వేస్తుంది ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌తిప‌క్షాలే కార‌ణ‌మ‌నుకున్నా.. కానీ.. ప్ర‌జ‌లు కూడా ప్ర‌తిప‌క్షంలోనే ఉన్నారంటూ పాపం కేసీఆర్ గుస్సా అవుతున్నార‌ట‌.

1 Comment

  1. One can’t bluff all the people all the time. He managed the scenario before bifurcation by leading the dowager queen into a make believe world of bluffs and false promises. Now every body got his quota and are up in arms. The end game is near.

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.