పది మందికి 250 కోట్లు.. కెసిఆర్ ప్లాన్ బీ ఇదే

తెలంగాణలో ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడం వల్ల రాజకీయ పార్టీలన్నీ వ్యూహాలను ఆచరణలో పెట్టడానికి సిద్ధమయ్యాయి. తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి మరోసారి అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తోంది తమ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులను చెప్పుకుంటూనే రానున్న రోజుల్లో చేయబోయే కార్యాచరణను సైతం ప్రజలకు వివరిస్తూ ఉంది దీంతో పాటు ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే ఎత్తులను రూపొందిస్తోంది ఆ పార్టీ అధిష్టానం. టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఎన్నికల్లో గెలిచేందుకు ఎన్నో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అదే సమయంలో కొన్ని కీలక నిర్ణయాలను సైతం తీసుకుంటున్నారు. టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఏర్పాటయిన మహాకూటమిని ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారు. అయితే, కెసిఆర్ ప్రకటించిన జాబితాలోని అభ్యర్థుల పట్ల ప్రజలు వ్యతిరేకత చూపిస్తున్నారు. దీంతో ఆ పార్టీలో కలవరం మొదలైంది.

ఇదే పరిస్థితి కొనసాగితే ఓడిపోవడం ఖాయమని భావించిన గులాబీ బాస్ మరో సంచలన ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. టీఆర్ఎస్ పోటీ చేయబోయే 119 స్థానాల్లో క్లిష్టమైన 25 స్థానాలను ఎంచుకుని, అక్కడ ఆ పార్టీ అభ్యర్థులతో పాటు ఒక్కో ఇండిపెండెంట్ నీ పోటీ చేయించాలని టిఆర్ఎస్ అధినేత నిర్ణయించారని తెలుస్తోంది. ఇందుకోసం ఒక్కో అభ్యర్థికి పది కోట్ల రూపాయల చొప్పున ఆర్థిక సాయం కూడా చేయనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి తమ పార్టీకి విజయవకాశాలు పెరుగుతాయన్నది కెసిఆర్ ఆలోచననే టాక్ వినిపిస్తోంది. ఇదే జరిగితే తెలంగాణ రాష్ట్ర సమితి మరోసారి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడిది తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.