ఈ సారి నందమూరి సుహాసినితో కేసీఆర్ ప్లాన్!

రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తు వేయటం కామన్ గా జరిగేదే. ఇటీవలే జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా నందమూరి సుహాసినిని బరిలోకి దింపి కొత్త ప్రయత్నం చేశారు చంద్రబాబు. అయితే ఊహించని రీతిలో ఆమె ఓటమి చవిచూసింది. టీఆర్ఎస్ చూపిన సెంటిమెంటో లేక మరే కారణమో తెలియదు కానీ టీడీపీకి వస్తాయనుకున్న సీట్లు రాలేదు. అయినా చంద్రబాబు ఏ మాత్రం నిరుత్సాహ పడలేదు. రంగంలోకి దిగాక గెలుపోటములు అంగీకరించాలని భావించారు. హరికృష్ణ కూతురు సుహాసిని కూడా రాజకీయాలకు దూరంగా ఉండనుంది అనే టాక్ వచ్చేసింది. అయితే ఇంతలోనే సుహాసిని.. గులాబీ కండువా వేసుకోనుంది అనే వార్త బయటకు రావటం సంచలనాలకు తెరలేపుతోంది.
హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారా.? ఇప్పటికే ఇందుకు సంబంధించి నిర్ణయం జరిగిందా..? ఇవే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రెండోసారి ముఖ్యమంత్రి పీఠమెక్కాక సుహాసినిపై జాలి చూపించారు కేసీఆర్. సుహాసినిని అన్యాయం చేశారని చంద్రబాబును తిడుతూ ఆమెపై ప్రేమ ఒలికించారు కేసీఆర్. హరికృష్ణ కూతురు అన్యాయంగా ఓడిపోయిందనే జాలి కలిగిందేమో పాపం ఆమెను టీఆర్ఎస్ లో చేర్చుకొని ఎమ్మెల్సీ ఇవ్వాలని అనుకుంటున్నారట కేసీఆర్. ఈ విషయంపై అధికారిక సమాచారం రానప్పటికీ.. సుహాసిని టీఆర్ఎస్ లో చేరనుందంటూ రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి. 
అయితే కేసీఆర్ చూపిస్తున్నది సుహాసిని పై ప్రేమ కాదని, సుహాసిని పేరుతో ఆయనో మాస్టర్ ప్లాన్ వేశారని విశ్లేషకులు అంటున్నారు. సుహాసినికి ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా తాము ఆంధ్రావాళ్లని కూడా కలుపుకుని పోతామని ఫీలింగ్ క్రియేట్ చేస్తూ.. సాఫ్ట్ కార్నర్ తో ఆంధ్రా రాజకీయాల్లో ఎంటర్ కావచ్చని కేసీఆర్ స్కెచ్ వేశారని చెప్తున్నారు. ఇప్పటికే ఆంధ్రలో తనకు సానుకూల వాతావరణం ఉందని, సుహాసిని రూపంలో దానిని మరింత క్యాచ్ చేసుకోవాలని టీఆర్ఎస్ వర్గాలు ప్లాన్ చేశాయని తెలుస్తోంది. ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్న ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే.. ఇంకాస్త సమయం పట్టొచ్చు. చూద్దాం మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో! 

1 Comment

  1. There should be a limit, even to wild guesswork. As India is not Indira and Indira is not India so also K.C.R is not Telangana and telangana is not K.C.R. The much hyped Nehru legacy proved to be a passing phase.

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.