కేసీఆర్ ప్లానంతా కేటీఆర్ కోసమే! 

విజయవంతంగా రెండోసారి తెలంగాణ గడ్డపై విజయకేతనం ఎగురవేశారు కేసీఆర్. ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ప్రస్తుతం దేశ రాజకీయాల గురించి ఎక్కువగా మాట్లాడుతుండటం గమనించవచ్చు. అయితే ఆయనిలా ఎందుకు మాట్లాడుతున్నారు? దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతా అంటూ కేసీఆర్ చేస్తున్న ఆలోచనల వెనుక ఏం దాగివుంది? అనే కోణంలో చర్చించుకుంటున్నారు జనం. అయితే కేసీఆర్ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతూ తెలంగాణ రాష్ట్రాన్ని తన కొడుకు కేటీఆర్ చేతిలో పెట్టాలనే.. ఆయనిలా ప్లాన్ చేస్తున్నారనే వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి.
భారత దేశంలో కాంగ్రెస్, బీజేపీ మోడల్ అచ్చి రాలేదని చెబుతూ కొత్త కాన్సెప్ట్ అనేది ఖచ్చితంగా కావాల్సిందేనని కేసీఆర్ నొక్కి చెబుతున్నారు. అంతేకాదు తానే ఆ కాన్సెప్ట్ తెచ్చి తీరుతాయా అని మీడియా ముఖంగా అంటున్నారు. దేశమంతా తిరుగుతానని పేర్కొంటూ నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ ప్రభుత్వం కోసం కృషి చేస్తానని వెల్లడిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే.. ఇక ఆయన తెలంగాణపై ఎక్కువగా ఏకాగ్రత పెట్టారని స్పష్టంగా అర్థమవుతోంది. 
కాకపోతే అయితే ప్రస్తుత పరిస్థితుల్లో.. కేసీఆర్ అనుకున్నంత ఈజీగా అది సాధ్యం కాకపోవచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది.  2019 ఎన్నికలకు ముందైతే బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు కూడా సాధ్యం కాకపోవచ్చు అంటున్నారు. ఏ కూటమి ఏర్పడినా.. 2019 ఎన్నికల తర్వాత అప్పటి ఫలితాలను బట్టి ఏర్పడవచ్చు కానీ ప్రస్తుతం మాత్రం కుదరదు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎన్ని పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడినా బీజేపీనో.. కాంగ్రెస్ పార్టీనో మద్దతు ఇవ్వాల్సిందే. లేదంటే ప్రభుత్వం ఏర్పాటు చేయలేరని అంటున్నారు. మొత్తానికైతే గులాబీ బాస్ మాటలు చూస్తుంటే..  వారసత్వం పేరుతో రాష్ట్రాన్ని కేటీఆర్ చేతిలో పెడితే ప్రజలు తిరగబడతారన్న ఉద్దేశంతో.. తాను ఢిల్లీలో చక్రం తిప్పాలి కాబట్టి.. తెలంగాణను కేటీఆర్ చూసుకుంటారని చెప్పి కొడుక్కు పగ్గాలు కట్టబెట్టాలని చూస్తున్నాడని తెలుస్తోంది కదూ!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.