పొత్తుల పై మాట్లాడుకున్న కేసీఆర్- పవన్

           హైదరాబాద్ ప్రగతిభవన్లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భేటీ అయిన సంగతి తెలిసిందే. తొలిసారిగా పవన్ కళ్యాణ్ కేసీఆర్ ను కలిసేందుకు ప్రత్యేకంగా వెళ్లారు. కేసీఆర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు గంటసేపు వారిద్దరి మధ్య సమావేశం జరిగింది. అదే సమయంలో కేసీఆర్ కోసం ముందుగా గంటన్నర పాటు ఎదురు చూశారు పవన్. సమాచారం ఉన్నప్పటికీ గవర్నర్ నరసింహన్ వద్దకు వెళ్లిన కేసీఆర్ కు అక్కడ ఆలస్యమైంది. అందుకే వెంటనే రాలేకపోయారని తెలిసింది. వీరిద్దరి భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఏ అంశాలపై మాట్లాడుకున్నారనేది హాట్ టాపికైంది. 
           మొన్న రాజ్ భవన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ తో పవన్ మాట్లాడటం తప్ప ప్రత్యేకంగా కలిసింది లేదు. తాజా రాజకీయాంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. పవన్ కళ్యాణ్ కేసీఆర్ భేటీకి ప్రత్యేక ప్రాధాన్యమేమీ లేదని జనసేన అధికారికంగా ప్రకటించింది. మర్యాద పూర్వకంగానే కేసీఆర్ ను పవన్ కలిశారని చెప్పింది. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెల్పినట్లు పవన్ కల్యాణ్ చెప్పారు. రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చూసి ఆశ్చర్యపోయానని పవన్ అంటున్నాడు. 24 గంటల విద్యుత్ ఎలా సాధ్యం అడిగి తెలుసుకున్నానని పవన్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు కరెంట్ విషయంలో తనకు చాలా అనుమానాలు ఉండేవి. అసలు అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన తీరు తనకు బాగా నచ్చిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. 24 గంటల కరెంట్ ఇవ్వడాన్ని ఇండియాలోనే మంచి ఉదాహరణగా చూడొచ్చని పవన్ కళ్యాణ్ అన్నారు.
           తెలంగాణ ఉద్యమం, నాయకుల గురించి పవన్ ఆసక్తికరంగా స్పందించారు. తెలంగాణ నాయకుల స్పూర్తిని చూసి నేర్చుకోవాలని పవన్ కళ్యాణ్ ఎప్పుడూ అంటుంటారు. ఏపీలో పర్యటించినప్పుడల్లా ఇదే మాట చెపుతుంటానని పవన్ ప్రస్తావించారు. టీఆర్ఎస్ నాయకుల మీద గౌరవం ఉందని తాను మొదటి నుండి చెపుతున్నానని పవన్ అన్నారు. 
పొత్తు కోసమేనా…
         రాబోయే కాలంలో తెలంగాణలో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే అంశం పై పవన్ కేసీఆర్ తో మాట్లాడారంటున్నారు. మరో భేటీలో దీని పై ఒక క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. ఇందుకు కేసీఆర్ సమ్మతించారని సమాచారం. ఈ కీలక భేటీలోనే పోటీ గురించి వారు మాట్లాడుకున్నారట.  
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.