మోదీ, కేసీఆర్ రహస్య ఒప్పందం బయటపడింది

తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. దీంతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రాజకీయ పార్టీలతో పాటు, అధికారులు ముందస్తు సన్నాహాలు ముమ్మరం చేశారు. రేపో మాపో కేసీఆర్ సర్కారు అసెంబ్లీని రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి మొదలైంది. ప్రభుత్వ చర్యలు కూడా ఇలాంటి సంకేతాలనే ఇస్తున్నాయి. దీంతో అధికార, ప్రతిపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలతో ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అధికార టీఆర్ఎస్-బీజేపీ బంధం గురించి ఓ వార్త బయటికి వచ్చింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాకరేపుతున్న ఈ వార్త సోషల్ మీడియా సహా పలు వెబ్‌సైట్లలో వైరల్ అవుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. భారత ప్రధాని మోదీ మధ్య ఒప్పందం జరిగిందనేదే ఆ వార్త సారాశం. ఇటీవల పలుమార్లు ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.. మోదీతో డీల్ కుదుర్చుకుని వచ్చారనే వార్త రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.

దీని ప్రకారం… కేసీఆర్ తన పదవికి రాజీనామా చేసి, అసెంబ్లీ రద్దుకు సిపారసు చేస్తే.. ఆ నిర్ణయాన్ని గవర్నర్‌ ఆమోదించి, రాష్ట్రపతి పాలనకు లేదా ఆయననే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని ప్రతిపాదించవచ్చు. కానీ, గవర్నర్ మాత్రం కేసీఆర్‌కు ఛాన్స్ ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఆయనతో మాట్లాడిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే గవర్నర్, కేసీఆర్‌కు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు కూడా దీనికి బలం చేకూర్చుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. కేంద్రం చేసే సాయానికి ప్రతిఫలంగా రాష్ట్రంలో బీజేపీ కోరుకున్న పది స్థానాల్లో టీఆర్ఎస్ డమ్మీ అభ్యర్ధులను నిలబెట్టాలని నిర్ణయించుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఇదే జరిగితే కేసీఆర్ సీఎం హోదాతోనే ప్రచారం చేసుకోవచ్చు. అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించవచ్చు.

మరోవైపు, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఆదివారం అర్ధరాత్రి శంషాబాద్‌ విమానాశ్రయంలో రాష్ట్ర పార్టీ ముఖ్యులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను సమీక్షించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తే స్వయంగా తానే రంగంలోకి దిగుతానని పార్టీ రాష్ట్ర నేతలకు భరోసా ఇచ్చారని టాక్. అంతేకాదు, టీఆర్‌ఎస్‌పై సీరియస్‌ ఫైట్‌ చేయబోతున్నామని, యుద్ధం మొదలైనట్లేనని, పార్టీ నాయకులు తమ వంతు పోరాటం చేయాలని పిలుపునిచ్చారని తెలుస్తోంది. ఈ నెల 12 లేదా 15వ తేదీన మహబూబ్‌నగర్‌ నుంచి ఎన్నికల శంఖాన్ని పూరిస్తానని, వచ్చే మూడు నెలల్లో పది రోజులకు ఒకసారి ప్రచారానికి వస్తానని అమిత్ షా చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. ఇదిలాఉండగా, బీజేపీ నేతల మాటలు, ఎన్నికల కోసం చేసే ప్రయత్నాలు ఇతర పార్టీలను డైవర్ట్ చేసేందుకేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.