కేసీఆర్ ముంద‌స్తు ప్లాన్‌… బీజేపీ వ్యూహ‌మా!

తెలంగాణ సీఎం కేసీఆర్ వేగాన్ని పెంచారు. మొన్న ముగ్గురు.. ఇప్పుడు 11 మంది ఐఏ ఎస్ అధికారుల‌ను బ‌దిలీచేశారు. పార్టీకు అనుకూలంగా ఉండేచోట‌.. అనువైన అధికారుల‌కు కీల‌క‌మైన పోస్టులు క‌ట్ట‌బెట్టార‌నే విమ‌ర్శ‌లున్నాయి. అయినా.. మ‌నం గెల‌వాలే అనే ధీమాతో గులాబీబాస్ చ‌క్కం తిప్పుతున్నారు. వ‌చ్చెనెల‌లో జ‌రిగే ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌కు ఏకంగా ఏడెనిమిది ల‌క్ష‌ల మందిని త‌ర‌లించాల‌నే యోచ‌న‌లో ఉన్నార‌ట‌. పైగా.. ఎమ్మెల్యేలు,  ఎంపీలు కీల‌క ప‌ద‌వుల్లో ఉన్న నేత‌ల‌కూ టార్గెట్‌లు వెళ్లాయి. ల‌క్ తెచ్చే.. ప‌ద‌వులు తెచ్చే గ్ర‌హాల‌న్నీ కేసీఆర్‌కే అనుకూలంగా ఉన్నాయంటూ గులాబీనేత‌లు తెగ సంబ‌ర‌ప‌డి పోతున్నారు. అందుకే.. సార్ ..2019లోనూ సీఎం అనేంత‌గా కాన్ఫిడెన్స్‌కు వ‌చ్చారు. ఇదంతా మేక‌పోతు గాంబీర్యం అనేది మాత్రం.. హ‌స్తం నేత‌లు  ఎద్దేవాచేస్తున్నారు. స‌ర్లే..  జ‌మిలీ ఉంటూ… కూత‌పెట్టిన బీజేపీ సైలెంట్ అయింది. కానీ.. కేసీఆర్ మాత్రం.. ఆద‌రాబాద‌రాగా ఎందుకింత‌గా ముంద‌స్తు ముచ్చ‌ట ప్ర‌ద‌ర్శిస్తున్నారంటే.. ఇదంతా క‌మ‌లం ఆడిస్తున్న నాట‌కం అనేది విప‌క్షాల ఆరోప‌ణ‌. ఎందుకంటే.. టీడీపీ.. కాంగ్రెస్ పొత్తుతో బీజేపీను  తెలుగు రాష్ట్రాల్లో దెబ్బ‌తీయాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చాయి.
దీనిపై ఎవ‌రెలాంటి అభ్యంత‌రం చెప్పినా.. హైక‌మాండ్ నిర్ణ‌య‌మే ఫైన‌ల్ అంటూ.. చంద్ర‌బాబు, అటు.. హ‌స్తం నేత‌లు ప్ర‌క‌టించేశారు. ఇది.. ఇక్క‌డ వ‌ర‌కూ అయితే.. ఓకే. కానీ.. జాతీయ‌స్థాయిలోని మిగిలిన ప్రాంతీయ పార్టీలు కూడా  ఎన్‌డీఏ కూట‌మి నుంచి బ‌య‌ట‌కు వెళితే బీజేపీ రేప‌టి  ఎన్నిక‌ల్లో ఘోర‌ప‌రాజ‌యం చ‌విచూడాల్సి ఉంటుంద‌నే ఆందోళ‌న కూడా క‌మ‌లనాథుల్లో  నెల‌కొంది. అందుకే.. అద‌ను చూసి దెబ్బ‌తీయ‌టం.. శ‌త్రువు.. శ‌త్రువును మిత్రుడిగా మార్చుకోవ‌ట‌మే ల‌క్ష్యంగా.. బీజేపీ.. కేసీఆర్‌ను నెత్తిన పెట్టుకుంది. చంద్ర‌బాబును విమ‌ర్శించే స‌మ‌యంలోనే కేసీఆర్‌ను ఆకాశానికి ఎత్తాడు. జ‌గ‌న్ ఉచ్చులో బాబు చిక్కాడంటూ.. చుల‌క‌న చేశాడు. రాజ‌కీయ వైరంతో ఇవ‌న్నీ చేసినా.. నీ శ‌త్రువులు నాకు బ‌ల‌మంటూ సంకేతాలు ఇచ్చిన‌ట్టుగానే టీడీపీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. అందుకే.. కేసీఆర్ రూపంలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌తో టీడీపీ బ‌ల‌హీన‌త‌ను బ‌య‌ట‌కు చాట‌డం.. అదే స‌మ‌యంలో బాబు బ‌ల‌హీన‌త‌కు గుర్తుగా.. పొత్తుల‌ను చూప‌టం.. వంటివి బీజేపీ వ్యూహంగానే విశ్లేష‌కులు భావిస్తున్నారు. దీనిలో భాగంగానే.. కేసీఆర్‌కు అనుకూల‌మైన నిర్ణ‌యాల‌తో బీజేపీ హైక‌మాండ్‌.. కేసీఆర్ నోట ఫెడ‌ర‌ల్‌ఫ్రంట్ అనే మూడోకూట‌మి గొంతును నొక్కేశార‌నే పుకార్లు వినిపిస్తున్నాయి.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.