కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌.. మూణ్నాళ్ల ముచ్చ‌టేనా!

అనుక‌న్న‌దొక్క‌టీ.. అయిన‌ది ఒక్క‌టీ.. బోల్తా కొట్టిందిలే.. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అనుకుంటూ.. ఉసూరు మంటున్నారట గులాబీద‌ళం. ఎన్నో ఆశ‌లు పెట్టుకుని.. జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌నుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అదేనండీ.. మ‌న క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావుకు ఊహించ‌ని ప‌రాభ‌వ‌మే అనాల్సిందే. లేక‌పోతే.. జేడీఎస్‌ను వెనుక నుంచి ఎంక‌రేజ్ చేసి.. చివ‌ర‌కు.. హైద‌రాబాద్‌లో త‌ల‌దాచుకునేందుకు.. స్టార్‌హోట‌ల్స్‌.. కాపాలాకు.. తెలంగాణ పోలీసుల‌కు ఉంచితే.. ఇంత ప‌ని చేస్తారా అంటూ.. కేసీఆర్ వ‌ర్గం గుస్సా అవుతున్నార‌ట‌. కుమార‌స్వామి సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. అనుకున్న‌ట్టుగానే..  బీజేపీ వ్య‌తిరేక వ‌ర్గం అంతా.. అక్క‌డకు చేరారు.. కేవ‌లం ఒక్క కేసీఆర్ త‌ప్ప‌. అక్క‌డే అస‌లు చిక్కు వచ్చిప‌డింది. ఎందుకంటే.. నిన్న‌టి వ‌ర‌కూ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అంటూ కేసీఆర్ స్వ‌రం పెంచ‌గానే.. అంద‌రూ ఓకే అన్నారు. మ‌మ‌తా బెన‌ర్జీ, మాయావ‌తి, అఖిలేష్ అంద‌రూ మేమంతా నీవైపే అన్నారు. చివ‌ర‌కు.. ఇప్పుడేమో.. అంద‌రూ ఏపీ సీఎం చంద్ర‌బాబు భార‌త‌కూట‌మికే మొగ్గుచూపుతున్నార‌నే గుస‌గుస‌లు.  మ‌రోవైపు కేసీఆర్ క‌ర్ణాట‌క వెళ్ల‌క‌పోవ‌టం వెనుక కార‌ణాలు వెతికే ప‌నిలో విప‌క్షాలున్నాయి. ఎంద‌కంటే.. 2014కు ముందు తెలంగాణ రాష్ట్రం ఇస్తే.. టీఆర్ ఎస్‌ను కాంగ్రెస్‌లో క‌లుపుతానంటూ స్వ‌యంగా కేసీఆర్ సోనియాగాంధీకు హామీనిచ్చారు. మ‌రి ఆమె మ‌న‌సులో ఏముందో కానీ.. తెలంగాణ వైపు మొగ్గుచూపారు. కేసీఆర్ మాట మార్చినా.. తెలంగాణ ఇచ్చామ‌నే కృత‌జ్ఞ‌త‌తో అయినా తెలంగాణ ప్ర‌జ‌లు త‌మ‌కు అధికారం క‌ట్ట‌బెడ‌తార‌ని ఆశించారు. కానీ.. కాంగ్రెస్‌ను ముద్దాయిగా బోనులో ఉంచి.. కేసీఆర్ అధికారం సొంతం చేసుకున్నారు.

 

ఇప్పుడు.. అదే కాంగ్రెస్‌తో చెట్ట‌ప‌ట్టాల్ వేయాల్సి రావ‌టం కేసీఆర్‌ను వెన‌క్కి లాగింద‌నే వాద‌న కూడా తెర‌మీద‌కు వ‌చ్చింది. కాంగ్రెస్ పార్టీ లేకుండా కూట‌మి ఏర్పాటు చేసినా ప్ర‌యోజ‌నం లేద‌నే భావ‌న‌తోనే మాయావ‌తి, మ‌మ‌తాబెన‌ర్జీ, అఖిలేష్ చివ‌ర‌కు చంద్ర‌బాబు కూడా ఏక‌మైన‌ట్లుగా కేసీఆర్ వ‌ర్గం భావిస్తుంది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కూ తాము ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌కు ఇక తిలోద‌కాలు ఇవ్వాల్సి వ‌స్తుంద‌నే ఆలోచ‌న‌లో ప‌డ్డారు. వాస్త‌వాన‌కి.. కేసీఆర్ సీఎంగా పూర్తికాలం చేయ‌లేదు. పైగా జాతీయ రాజ‌కీయాల్లో ఆయ‌న అనుభ‌వం కూడా అంతంత‌మాత్ర‌మే. ఇదే స‌మ‌యంలో కేసీఆర్ పాల‌న‌పై తెలంగాణ ప్ర‌జ‌ల్లో క‌నిపించ‌ని వ్య‌తిరేకత ఉంది. దీంతో ఇక్క‌డ కాంగ్రెస్ పాగా వేయాల‌ని భావిస్తుంది. దీన్ని అద‌నుగా మ‌ల‌చుకుని టీడీపీ.. కాంగ్రెస్ తో దోస్తీ చేయాల‌నుకుంటుంది. ఇరు పార్టీల‌కు లాభ‌దాయ‌కంగా ఉండ‌టంతో హ‌స్తం కూడా సైకిల్ వైపే చూస్తుంది. ఇరు పార్టీల బ‌లం.. క‌ల‌యిక‌.. కేసీఆర్ కుర్చీకే ఎస‌రు పెట్టే అవ‌కాశాల‌ను మ‌రింత పెంచుతున్నాయి. సో.. ఇవ‌న్నీ క‌ల్వ‌కుంట్ల కుటుంబంలో.. అస‌హ‌నాన్ని.. కాస్త ఆందోళ‌న‌ను క‌లిగిస్తాయ‌న‌టంలో ఎటువంటి అనుమానం లేదంటున్నారు.. గులాబీ అభిమానులు. 

1 Comment

  1. KCR గారికి ఆత్రం ఎక్కువ. ఆలోచన ఎక్కువ. అధికార యావ కూడా ఎక్కువ. దశాబ్దాల వయస్సు ఉన్న తెలంగాణ ఉద్యమానికి సరైన సమయంలో కొమ్ము కాసిన ఆయన, ఆ ఫలాలను కూడా కుటుంబ సమేతం గా అనుభవిస్తున్నారు. తెలంగాణా లో ఉన్న పరిస్థితులను,అలాగే మోదీగారి కరుణాకటాక్షాలను దృష్టిలో పెట్టుకొని,
    ఆయన రచించిన మూడో కూటమి కి క్షేత్ర స్థాయిలో మనుగడ ఉండదని ఆయనకీ తెలీదని అనుకోలేం.

    కానీ ఏదో ఒకటి చేసి జాతీయస్థాయిలో నేనూ ఒక నాయకుడినే అని అనిపించుకోవాలి, అలాగే మోడీ గారికి 2019లో అవసర మయ్యే మద్దతు కోసం, మూడో కూటమి మద్దతును కూడా గంపగుత్తగా అందించాలి ” అనే రాజకియ ఆలోచనతో ఆయన ఉంటే ,ఆయనకంటే రెండాకులు ఎక్కువే చదివిన మిగతా ప్రాంతీయ నాయకులు ఊరు కొంటారా ?

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.