హస్తినలో కేసీఆర్ పోరు

ఇంటి పోరుతో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సతమతమవుతున్నారనే ప్రచారం ఉంది. దాన్ని తప్పించుకునేందుకు జాతీయ రాజకీయాలవైపు ఆయన దృష్టి సారించారంటారు. కొడుకు కేటీఆర్ ను సిఎం గద్దెపై కూర్చోపెట్టేందుకు కేసీఆర్ హస్తిన రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ చెబుతోంది. అందుకే జాతీయ నేతలతో కేసీఆర్ మాట్లాడుతున్నట్లు లీక్ లు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత ఉందో గులాబీ నేతలకు తప్ప ఎవరికీ తెలియదు. ఇప్పుడు తాజాగా ఢిల్లీలో ధర్నా చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారట. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి, దేశంలో కాంగ్రెస్, బిజెపిలకు ప్రత్యామ్నాయం తయారు చేయాలనే ఆలోచనతో ఉన్నారు కేసీఆర్. అందుకే ఢిల్లీలో వివిధ డిమాండ్లపై ధర్నా చేయాలని భావిస్తున్నారు. 
రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ అంశాలతో తొలిపోరు చేపట్టాలని ఆలోచనట. అంతే కాదు.. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఢిల్లీలో మహాధర్నా నిర్వహిస్తే మైలేజి వస్తుందని వ్యూహ రచన చేస్తున్నారు. జంతర్‌మంతర్‌ వద్ద చేసే ఈ ధర్నాకు రాష్ట్ర మంత్రులతో పాటు జాతీయ పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానిస్తారట. ఇప్పుడా ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. వీలున్నంత తొందరగా ధర్నా చేయాలనేది వారి ఆలోచన. 
12 నుంచి అసెంబ్లీ….
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 12 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. సభల మధ్యలోనే ఓ రోజు అంతా ఢిల్లీకి వెళ్లే ప్లాన్ చేస్తున్నారు. నేతలందరినీ అక్కడకు తీసుకెళ్లేందుకు కేసీఆర్ టీమ్ ఏర్పాట్లు చేస్తోంది. మొన్న వైకాపా నేతలు ఎలా అయితే ఢిల్లీకి వెళ్లారో అలా టీఆర్ఎస్ వాళ్లు  అక్కడకు వెళుతున్నారట. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.