కేసీఆర్ పేరుకు ఎన్ని అర్థాలు చెబుతారు..?

క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖ‌ర్ రావు.. ఈయన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి.. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మంత్రి వర్గంలో కుటుంబ సభ్యులైన కేటీఆర్, హరీష్ రావుకు చోటు కల్పించారు కేసీఆర్. వాళ్లిద్దరూ కేసీఆర్‌కు వెన్నంటి ఉంటూ అటు తెలంగాణ అభివృద్ధిలో.. ఇటు పార్టీ పురోగతిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తమపై నమ్మకం ఉంచి గొప్ప బాద్యతలను అప్పగించిన కేసీఆర్‌ను వీళ్లిద్దరు పొగిడినంతగా నాలుగేళ్ల కాలంలో మరెవరూ పొగిడుండరు. అంతేకాదు వీరిద్దరూ కలిసి కేసీఆర్ పేరుకున్న నిర్వచనానే మార్చేస్తున్నారు.

వాస్తవానికి కేసీఆర్ అంటే క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖ‌ర్ రావు అనే సంగ‌తి అందరికీ తెలుసు. కానీ, తెలంగాణ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌ ఆయన పేరుకు కొత్త నిర్వచనాలను చెబుతున్నారు. తద్వార ఆయనపై ఉన్న గౌరవాన్ని బహిరంగంగా వెల్లడిస్తున్నారు. గతంలో సిద్దిపేట జిల్లా ఆవిర్భావం రోజున కేసీఆర్ పేరుకు మరొక నిర్వచనం చెప్పారు మంత్రి హరీశ్ రావు. అప్పుడు కేసీఆర్‌లో K అంటే KNOWLEDGE (ఙ్ఞానం), C అంటే COMMITMENT (నిబద్ధత), R అంటే RECONSTRUCTION (పునర్నిర్మాణం) అని వివరించారు. తాజాగా ఆయనే కేసీఆర్‌కు మరో నిర్వచనం చెప్పారు. K అంటే కాలువలు, C అంటే చెరువులు, R రిజర్వాయర్లని చెప్పుకొచ్చారు.
ఆయన కుమారుడు కేటీఆర్ అయితే ఒకడుగు ముందుకేసి.. కేసీఆర్ అనే ప‌దానికి తనదైన శైలిలో నిర్వ‌చ‌నం చెప్పారు. తెలంగాణ‌లో ప్ర‌ధాన న‌గ‌ర‌మైన క‌రీంన‌గ‌ర్‌లో చేప‌ట్టే అభివృద్ధి పథకానికి కేసీఆర్ పేరు ప్రతిబింబించేలా ‘‘క‌రీంన‌గ‌ర్ సిటీ రినోవేష‌న్’’ అని పేరు పెట్టారు. ఇందులో K అంటే కరీంనగర్ C అంటే సిటీ R రినోవేషన్ అని అర్థం వచ్చేలా ఆలోచించే ఈ పేరు పెట్టినట్లు తెలుస్తోంది. వీళ్ల నిర్వచనాలను చూస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తుండగా.. ప్రతిపక్ష పార్టీలు మాత్రం వీళ్లిద్దరూ కేసీఆర్ భజన చేస్తున్నారని, బాగా అతి చేస్తున్నారని తమదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.