కేసీఆర్ ఓట‌మికి కౌంట్‌డౌన్‌!

కేసీఆర్‌.. తెలంగాణ‌లో తిరుగులేని నేత‌. ఇప్పుడిక దేశ్‌కీ నేత‌గా జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్ప‌బోతున్నారు. ప‌క్షిలాగా దేశ‌మంతా చుట్టొస్తానంటూ ఈ మ‌ధ్య‌నే ఘ‌నంగా ప్ర‌క‌టించారు. ఆంధ్రోళ్లంటే అంతెత్తున లేచి తిట్ల‌పురాణం అందుకునే కేసీఆర్‌.. ఏకంగా దేశాన్నే ఏకం చేస్తాడ‌ట. ప‌క్క‌నున్న తెలుగోళ్ల‌నే క‌లుపుకోని న‌డ‌వ‌లేని నాయ‌కుడు ఇక దేశంలో వున్న భిన్న‌ప్రాంతాలు, భాష‌ల‌ను మ‌రి ఎలా క‌లుపుకుంటారో. ఇక‌పోతే సొంతిట్లో మొద‌లైన చిచ్చు గురించి మాత్రం సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్లులేడు. ఇప్ప‌టి దాకా త‌న‌కు ప్ర‌త్య‌ర్థి లేద‌ని విర్ర‌వీగిన టీఆర్ ఎస్‌కు.. కాంగ్రెస్‌కు అద‌నంగా మ‌రో పార్టీ జ‌త‌క‌ట్టింది. దంచుడో.. దంచుడంటూ క‌దం తొక్కుతోంది. కేసీఆర్ కోర‌లు తీసేందుకు వ్య‌తిరేక వ‌ర్గం అంతా కూట‌మిగా మారితే.. మూడో కూట‌మి మూణ్నాళ్ల ముచ్చ‌టే అవుతుందేమో. అభిన‌వ గాంధీ..
తెలంగాణ ఉద్య‌మ‌నేత‌.. టీఆర్ ఎస్ అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావుకు ఇక చుక్క‌లు చూపిస్తార‌ట‌. ఇప్ప‌టి నుంచి కౌంట్‌డౌన్ షురూ అయిన‌ట్లేన‌ట‌. ఇంకేముంది.. కుర్చీకింద కాళ్లు క‌దిలించ‌ట‌మే మిగిలింద‌ట‌. త‌న‌కు తిరుగులేద‌ని తెలంగాణ రాష్ట్రం గొప్ప‌త‌నం మొత్తం తానే అంటూ భావిస్తున్న కేసీఆర్ ఇక కాచుకో..నీ అధికారం  చేయ‌ట‌మే మా ల‌క్ష్య‌మంటూ తెలంగాణ జ‌న‌స‌మితి పార్టీ హెచ్చ‌రిక‌లు జారీచేసింది. స‌రూర్‌న‌గ‌ర్ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన జ‌న‌స‌మితి స‌భ‌లో వేదిక‌పై ఉన్న పెద్దా.. చిన్న‌లంతా.. కేసీఆర్‌ను ల‌క్ష్యం చేసుకుని దుయ్య‌బ‌ట్టారు. గ‌ద్దెనెక్కిన కేసీఆర్‌కు ఇక మిగిలింది.. రాజ‌కీయ స‌న్యాస‌మేనంటూ ఎద్దేవాచేశారు. 
కుటుంబ పాల‌న‌తో ఉద్య‌మ‌స్ఫూర్తిని దెబ్బ‌తీస్తున్న కేసీఆర్ నోరు మూయిస్తామంటూ తెగేసి చెప్పారు.  నాలుగేళ్ల పాల‌న అమోఘ‌మ‌ని.. అ ద్భుత‌మంటూ సొంత‌డ‌బ్బా కొట్టుకుంటున్న కేసీఆర్ యంత్రాంగం ప‌రువును జ‌న‌స‌మితి ఒక్క స‌భ‌తో తుస్సుమ‌ని తీసేసింది. రెండు ల‌క్ష‌ల ఎక‌రాలు ఏవో సాకులు చెప్పి భూసేక‌ర‌ణ‌తో  కేసీఆర్ ఫ్యామిలీ దండుకుంద‌న్నారు. 620 మంది ఉద్య‌మ‌కారులు తెలంగాణ కోసం ప్రాణ‌త్యాగం చేస్తే.. అదంతా త‌న ఖాతాలో వేసుకున్న నేత మెడ‌లు వంచుతామంటూ ఘాటుగానే స్పందించారు. ఈ లెక్క‌న కేసీఆర్ అండ్ కో దోచుకున్న ప్ర‌జాధ‌నం వెలికితీసి.. బ‌ట్ట‌బ‌య‌లు చేసినా ఆశ్చ‌ర్య‌పోనక్క‌ర్లేదు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.