కేసీఆర్ తెలంగాణ ప్రజలను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా..?

టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా..? ప్రజల్లో ఉన్న తెలంగాణసెంటిమెంట్‌‌‌ని క్యాచ్ చేసుకుంటున్నారా..? ఈయన చేసిన తాజా వ్యాఖ్యలు చూసి అవుననే అంటున్నారు జనం. నిర్మల్‌‌లో జరిగిన ఎన్నికల ప్రచారసభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు పలు చర్చలకు దారి తీస్తున్నాయి. ‘‘ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతే నాకేం నష్టం లేదు. ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకుంటాను. టీఆర్ఎస్ గెలవకపోతే.. రాష్ట్రం చంద్రబాబు చేతుల్లోకి వెళుతుంది’’అని కాసింత ఆవేదనతో కేసీఆర్ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగని ఆయన చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ.. ప్రాజెక్టులు కట్టొద్దని 35 లేఖలు రాసిన చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆ ప్రాజెక్టులను పూర్తిచేస్తాడా? అని అన్నారు.

ఈ మాటలు విన్నాక కూడా సభకు వచ్చిన జనాలనుంచి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం. అంటే జనాలు కేసీఆర్‌కు జై కొడుతున్నారా..? లేక చంద్రబాబుకు జై కొడుతున్నారా? అనేది తెలియని పరిస్థితి. సెకండ్ టర్మ్ ప్రచారం మొదలైనప్పటి నుంచి కేసీఆర్‌కు ఇలాంటి అనుభవాలే ఎదురవుతుండటం విశేషం. మా ప్రభుత్వం ఫలానా పనులు చేసింది, ఫలానా పథకాలు పెట్టింది. ఈ పథకాల ద్వారా ఇంత మంది లబ్ది పొందారు.. మళ్లీ గెలిపిస్తే ఇప్పుడు చేసిన అభివృద్ధి కంటే డబుల్ చేసి చూపిస్తామని చెప్పాల్సింది పోయి.. ఇలా మాట్లాడటం ఏంటని విస్తు పోయారు సభకు వచ్చిన జనం. పైగా.. తనకేం నష్టం లేదని చెప్పడం, ఓడిపోతే ఫాంహౌస్‌‌లో పడుకుంటానని జనాలను బ్లాక్ మెయిల్ చేయడం మరీ దారుణం.. అసలు కేసీఆర్‌‌ ఎందుకిలా అన్నారు..? ఏ మూడ్‌లో అన్నారు? దీని వెనుక ఆంతర్యం ఏమిటనే కోణంలో ప్రజల్లో చర్చలు ఊపందుకున్నాయి. మరోవైపు ప్రత్యర్థి పార్టీలకు మాత్రం ఇదో అస్త్రం అయిందనే చెప్పుకోవచ్చు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.